నా పెళ్లి ఎంతో అధ్బుతంగా జరుగుంది: జెస్సికా సింప్సన్
లండన్, జూన్ 8: ఇటీవలే మొదటి బిడ్డకు తన ప్రేమించిన వ్యక్తి ద్వారా జన్మనిచ్చిన హాలీవుడ్ ప్రముఖ సింగర్ 'జెస్సికా సింప్సన్' ఇక తాను ఆగలేనని త్వరలోనే తాను ప్రేమించిన, కాబోయే భర్త ఎరిక్ జాన్సన్‌ను వివాహామాడేందుకు సిద్దమైనట్లు తెలిపింది. అంతేకాకుండా వీరి పెళ్లి ప్రపంచంలో జరిగిన అధ్బుతమైన పెళ్లిల్లలో ఒకటిగా ఉంటుందని పేర్కోంది. 31 సంవత్సరాల వయసు కలిగిన జెస్సికా సింప్సన్ మే 1వ తారీఖున 'మాక్స్ వెల్ డ్రూ' అనే అమ్మాయికి జన్మనిచ్చింది.
కాబోయే భర్త ద్వారా బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ.. వీరిద్దరికి ఇంత వరకు పెళ్లి కాలేదు. ఐతే హాలీవుడ్‌లో పెళ్లి కాకుండా పిల్లల్ని కనడం, పెళ్లి చేసుకోని తర్వాత విడిపోవడం లాంటివి సహాజం. ఐతే జెస్సికా సింప్సన్, ఎరిక్ జాన్సన్‌ను ఇద్దరూ ఈసంవత్సరం చివర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్బంలో జెస్సికా సింప్రన్ మాట్లాడుతూ నేను ఇంక ఆగలేను. వెడ్డింగ్ డ్రస్సు అనుభవాన్ని నిజంగా నేను అనుభవించాలని కొరుకుంటున్నాను అని తెలిపింది.
ప్రపంచంలో ఎన్నో అద్బుతమైన పెళ్లిళ్లు జరిగాయి. మా పెళ్లి కూడా అలాంటి అధ్బుతమైన పెళ్లిళ్ల సరసన నిలుస్తుందని అన్నారు. ఈ సంవత్సరం చివర్లో మేమిద్దరం ఒకఇంటి వారు అవ్వాడనికి సిద్దమైనప్పటికీ.. ఇప్పటికీ మేము మా పెళ్లి తారీఖున ఇంకా ఫిక్స్ చేయలేదని వాపోయింది. కెరీర్ తొలినాళ్లలో జెస్సికా సింప్సన్ ఫ్యాషన్ డిజైనర్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. రికాడింగ్ ఆర్టిస్ట్‌గా, టెలివిజన్ పర్శనాలిటీగా పేరున్న జెస్సికా సింప్సన్ తన జీవితపు తొలి నాళ్లలో ఎన్న అధ్బుతమైన టెలివిజన్ షోలు చేశారు.
జెస్సికా సింప్సన్ ఏడు సార్లు బిల్ బోర్డ్ టాప్ 40లో స్దానం దక్కించుకున్నారు. ప్రపంచం మొత్తం మీద 30 మిలియన్ ఆల్బమ్స్‌ని అమ్మడం జరిగింది. 'డు యు నో' అనే ఆల్బమ్ పేరుతో 2008వ సంవత్సరంలో కంట్రీ మ్యూజిక్ మార్కెట్లోకి అడుగు పెట్టింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











