»   » నేను మూడు నెలల కడుపుతో ఉన్నానోచ్..!

నేను మూడు నెలల కడుపుతో ఉన్నానోచ్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మైలీ ఏంజిలా క్లాస్ హాలీవుడ్ టివి బ్యూటి. తను ప్రస్తుతం తన రెండవ బిడ్డకు జన్మనివ్వడానికి రెడీగా ఉన్నట్లు ఇటీవల తన అభిమానులకు తెలియజేశారు. దీంతో తమ అభిమానులు ఆనందంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఐరిష్ సింగర్ 'గ్రాహామ్ క్విన్' ను ఈమె వివాహాం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం తను మూడు నెలలు కడుపుతో ఉన్నట్లు వివరించారు. అంతేకాకుండా తనకు చాలా అనందంగా ఉందని అన్నారు. తల్లి కావడం అనేది పూర్వజన్మ సుకృతం అని అన్నారు.

మైలీ ఏంజిలా క్లాస్ ఐటివి లో చేసినటువంటి ఐయామ్ సెలబ్రిటి గెట్ మి అవుట్ ఆఫ్ హియర్ రియాలిటి షోలో తన అందచందాలతో షో మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. ఈ షో మొత్తానికి మైలీ ఏంజిలా క్లాస్ చాలా పాపులారిటి సంపాదించింది. ఈ షోలో ఆమె ధరించినటువంటి వైట్ బికిని యావత్ ఐటివి చూసే మగ మహారాజూలకి పిచ్చేక్కేలా చేసింది. ఈ బికినిని వేలం వేయగా వచ్చినటువంటి 7500 పౌండ్లను చారిటికి ఇచ్చి తన వంతు సహాయం అందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu