సెప్టెంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న 'నేకెడ్ సోల్జర్'

By Nageswara Rao

హాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలను నిర్మించడంలో ఎంతో ప్రసిద్ది చెందిన సంస్ద "మెగా విజన్ పిక్చర్స్ సంస్ద". గతంలో ఈ సంస్ద నిర్మించిన నేకెడ్ కిల్లర్, నేకెడ్ వెపన్ చిత్రాలు హాలీవుడ్‌లో బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఈ చిత్రానికి కొనసాగింపుగా ఈ సంస్ద నేకెడ్ సోల్జర్ అనే చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రంలో ఆసియా యూరోపియన్ మార్షల్ ఆర్ట్స్ లేడీ ఛాంపియన్ 'జెన్నిఫర్' నటించారు. ఈ సినిమాలో జెన్నిఫర్ తన అందచందాలతో పాటు యాక్షన్ సీన్స్‌లో అధ్బుతంగా నటించారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్‌ను చార్లెస్ ఏంజెల్స్, టామ్ రైడర్, మ్యాట్రిక్స్ చిత్రాల సినిమాలలో మాదిరి రూపొందించారు. అంతేకాకుండా బ్యాట్‌మెన్, మ్యాట్రిక్స్ చిత్రాలకు అధ్బుతమైన ఫైట్స్‌ని కంపోజు చేసిన ఇమాన్ పవర్స్ ఈ చిత్రానికి వర్క్ చేయడం మాత్రమే కాకుండా అధ్బుతమైన ఫైట్స్‌ని కంపోజ్ చేశారు.

యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిన మార్క్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో 'వి.ఫిలింస్' ద్వారా దంతాల వెంకటేశ్వరరావు సమర్పణలో ప్రసాద్ నిర్మాతగా విడుదల చేయనున్నారు. భారతదేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో ఈ చిత్రం విడుదలవుతుంది. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుగా రానున్న ఈ చిత్రంలో జెన్నిఫర్, ఆండీ, సామోహంగ్ తదితరులు ముఖ్య పాత్రలో పోషించారు.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X