ఆయనతో కలసి పనిచేయడం నాజీవితంలో మరిచిపోలేనిది..!
నోమి క్యాంప్ బెల్ బ్రిటిష్ మోడల్, ఫ్యాషనబుల్ ఉమెన్ మరియు క్యాట్ వాక్ బ్యూటి. నోమి క్యాంప్ బెల్ మిలన్ మరియు పారిస్ ర్యాంప్ షోలపై క్యాట్ వాక్ చేసి ఇంటర్ నేషనల్ ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో చాలా సార్లు కవర్ పేజి పై దర్శనమిచ్చిన నల్లజాతి కలవపువ్వు.
క్యాట్ వాక్ బ్యూటి తన స్వభావాన్ని ఎప్పుడూ కూల్ గాఉంచుకోవడం కోసం ప్రతి ఆరు వారాలకోకసారి సెలవులు ప్రకటించుకోని బాగా ఎంజాయ్ చేస్తుందంట. ఈ మధ్య జరిగినటువంటి కోన్ని సంఘటనలు తన మనసుని బాగా కలచివేశాయంట. అప్పటి నుంచి తన మనసుకి ప్రశాంతత కోసం ఇలాంటి ట్రిప్స్ వేస్తుందని సమాచారం. గతంలో కూడా లండన్ ఎయిర్ పోర్టులో ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్ తనపై దౌర్జన్యం చేయబోయిన సంగతి అందరికి తెలిసిందే.
నోమి క్యాంప్ బెల్ సినిమాలలోనే కాకుండా నిజ జీవితంలోకూడా చాలా సార్లు చారిటికి తన వంతు సహాయం అందించింది. ఆఫ్రికా ఖండంలోని పేదవారికోసం తను దక్షణాఫ్రికా గాంధీ నేల్సన్ మండేలా తోకూడా కలసి పనిచేయడం జరిగింది. నేల్సన్ మండేలా తోపని చేసినటువంటి అన్ని రోజులు తన జీవితంలో మరిచిపోలేనటువంటివని అన్నారు. 2005వ సంవత్సరంలో హారికేన్ కత్రినా విక్టిమ్స్ కోసం కూడా చాలా ఫండ్స్ వసూలు చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. తను చేసినటువంటి సేవలకు గాను యునెస్కో కమిటి 2010జులైలో పైరమిడ్ కాన్ మని లాంటి అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించడం జరిగింది.
ఇలా తను జీవితంలో ఎదుటివారినుండి చాలా నేర్చుకున్నానని సగర్వంగా చెప్తున్నారు నోమి క్యాంప్ బెల్. ఇలాంటి వర్కు చేస్తున్న సమయంలో మనకు రిలాక్స్ అవసరం కాబట్టి ప్రతి ఆరు వారాలకోకసారి చేసే పనినుండి బ్రేక్ తీసుకోవడం జరుగుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications











