ఆ పాత్ర అసలు ఎటునుండి మొదలుపెట్టలో అర్దం కావడం లేదు...!
ప్రపంచంలో ఆమెని అభిమానించని అభిమాని లేడంటే నమ్మండి. ఆమె ఎవరో కాదు ఒకప్పటి హాలీవుడ్ అందాలరాశి మార్లిన్ మన్రో. అసలు ఆమెను అంతగా అభిమానించడానికి ఆమెలో ఉన్న గోప్పదనం అనేది ఎవ్వరికి తెలీదు మోనాలిసా నవ్వులాగా. మార్లిన్ మన్రో అంటే అంత అభిమానం అందరికి, ఖచ్చితంగా చెప్పాలంటే మైఖేల్ జాక్సన్ కంటే కూడా మార్లిన్ మన్రోకి అభిమానులు ఎక్కువ. ప్రపంచం మెత్తం అభిమానులను సంపాదించింది మార్లిన్ మన్రో. అలాంటి మార్లిన్ మన్రో జీవితం ఆధారంగా సినిమా తీయాలని ఆండ్రూ ఓగన్ అనుకుంటున్నారు. చివరకు ఏంజలీనా జోలీ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నట్టు హాలీవుడ్ సమాచారం. ఈ విషయాన్ని ఆండ్రూ ఓగన్ ఏంజలీనా జోలీ యే చేస్తుందని ఏడిన్ బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వివరించారు. కాని ఈ విషయాన్ని ఏంజలీనా జోలీ ధృవీకరించినట్టు లేదన్న విషయం అందరికి తేలిసిందే.
అంతలోనే ఓ బయోపిక్ సినిమాలో నోమి వాట్స్ కి సెక్సీ మార్లిన్ మన్రో గా నటించే అవాకాశం రావడం ఎగిరిగంతేసింది. దానితోపాటు ఈ నోమి వాట్స్ మనసులో భయంకూడా పట్టుకుంది. దానికి కారణం ప్రపంచంలో మార్లిన్ మన్రో తెలియనివారంటులేరు. అంతేకాకుండా మార్లిన్ మన్రో గురించి ప్రతి ఒక్కరికి ఓ స్పష్టమైన ఐడియా కూడా ఉంది. తాను నటించబోమే బ్లండ్ అనే సినిమాలో ఈ పాత్ర కోసం తాను చాలా కష్టపడుతున్నట్లు వివరించారు. మార్లిన్ మన్రో పాత్ర అసలు ఎక్కడినుండి మొదలు పెట్టాలనేది అర్ధం కావడం లేదని తాను వాపోయింది. మార్లిన్ మన్రో పాత్ర నాకు చాలా ఒత్తడిని కలిగిస్తుందన్నారు. దానికి కారణం ఆమె అంత ఐకానిక్ పర్సన్ అని అన్నారు. అసలు ఎలా చేయాలో అర్ధం కావడం లేదన్నారు.


Click it and Unblock the Notifications











