ఆ సూపర్‌స్టార్ నా స్కర్ట్‌లో చేయిపెట్టి.. డైరెక్టర్ కళ్ళప్పగించి చూస్తూ..

సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురు కావడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. తాజాగా ఓ సూపర్‌స్టార్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన ఓ హీరోయిన్ అతడి నిర్వాహకాన్ని బయటపెట్టింది. గతంలో ఆస్కార్ అవార్డు గ్రహీత తనతో ప్రవర్తించిన తీరును ఎండగట్టింది. హాలీవుడ్ నటి నోమీ హారిస్ ఓ ఆడిషన్‌ సందర్భంగా జరిగిన వేధింపులను మీడియాకు వెల్లడించారు. ఆమె బయటపెట్టిన విషయాలు.. ఆ హీరో ఎవరంటే..

ఆ హీరో పేరు బయటకు

ఆ హీరో పేరు బయటకు

ఓ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన హీరో పేరును బయటపెట్టదలచుకోలేదు. నాతో ఆయన చెడుగా బిహేవ్ చేసినప్పుడు నా వయసు 20 సంవత్సరాలు ఉంటాయనుకొంటాను. ఆ సమయంలో అప్పుడే నేను కెరీర్ పరంగా ఎదుగుతున్నాను. కాబట్టి నేను బయటకు చెప్పలేకపోయాను. దాంతో మరుగున పడింది. ఇప్పుడు ఆయన పేరును బయటపెట్టి వివాదంగా మలచదలచుకోలేదు. కానీ నాకు ఎదురైన అవమానాన్ని తెలియజేయాలనుకొంటున్నాను అని నోమీ హ్యారీస్ పేర్కొన్నది.

నా కెరీర్ ఆరంభంలో

నా కెరీర్ ఆరంభంలో

అప్పుడప్పుడే నా కెరీర్‌ను ఆరంభించే పనిలో ఉన్నాను. ఆ సమయంలో ఆడిషన్స్ కోసం వెళ్లాను. ఆడిషన్స్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్, డైరెక్టర్‌తోపాటు సూపర్ స్టార్ కూడా ఉన్నారు. ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో నా శరీరాన్ని తడుముతూ స్కర్ట్‌లో చేయిపెట్టడంతో షాక్‌కు గురయ్యాను. అతడు అలా చేస్తూంటే వీళ్లంతా చూస్తూ మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది అని నోమీ హ్యారీస్ ఆవేదన వ్యక్తం చేసింది.

తప్పుగా ప్రవర్తించిన వ్యక్తితో

తప్పుగా ప్రవర్తించిన వ్యక్తితో

నేను క్రేంబిడ్జి యూనివర్సిటీలో ఉన్నత చదువులు అభ్యసించాను కాబట్టి నాకు జరిగిన అవమానాలను తట్టుకొన్నాను. నాతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తి సూపర్‌స్టార్ కావడంతో కొంత భయానికి గురయ్యాను. తాజాగా మీటూ ఉద్యమం కారణంగా ఇలాంటి చేష్టలను ఏ హీరో కూడా చేయడానికి సాహసం చేయడం లేదు అని నోమీ హ్యారీస్ అన్నారు.

మరో ప్రముఖుడితో

మరో ప్రముఖుడితో

మరోసారి వాలెర్ బ్రిడ్జ్ అనే సినీ ప్రముఖుడితో నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. నానా రకాలుగా వేధించడంతో చాలా బాధపడ్డాను. ఓ దశలో ఆయన సెట్లో ఉంటే నేను బయట ఉండే పరిస్థితి ఏర్పడింది. స్క్రిప్టు చదివే పేరుతో నన్ను వేధించాడు. కొన్నిసార్ల ఫోన్ చేసుకోవాలని చెప్పి బయటపడిన సందర్భాలు ఉన్నాయి అని నోమీ హ్యారీస్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X