కరోనా కాటుకు రాలిన మరో సినీ తార.. షాక్‌లో సినీ లోకం
కరోనావైరస్ కాటుకు మరో హాలీవుడ్ తార రాలిపోయింది. నాష్‌విల్లే, ది స్టంట్ మాస్టర్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సొంతం చేసుకొన్న అలెన్ గార్‌ఫీల్డ్ కరోనావైరస్ సోకడం ద్వారా తలెత్తిన సమస్యలతో కన్నుమూశారు. అలెన్ మృతిని తన సహచర నటి రోనీ బ్లాక్లే ఫేస్‌బుక్ ద్వారా ధృవీకరించారు. అలెన్ గార్‌ఫీల్డ్ ఆత్మకు శాంతి చేకూరాలి. నాష్‌విల్లేలో నాకు భర్తగా గొప్పగా నటించారు. కొవిడ్ 19తో బాధపడుతూ మఱనించారు. ఆయన మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాను. ఆయన కుటుంబానికి స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని ఓ ప్రకటనలో తెలిపారు.
అలెన్ నటుడు కావడానికి ముందు అమెచ్యూర్ బాక్సర్. అంతేకాకుండా స్పోర్ట్స్ జర్నలిస్టుగా కూడా పనిచేశారు. పలు చిత్రాల్లో విలనిజంతో కూడిన రాజకీయవేత్త, వ్యాపారవేత్త పాత్రలను అద్భుతంగా పోషించారు. వూడీ అనెన్, విమ్ వెండర్స్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా లాంటి అగ్ర దర్శకులతో పనిచేశారు. చివరి సారిగా చీఫ్ జాబు అనే చిత్రంలో కనిపించారు. 1986లో రూపొందించిన చిత్రం 2016లో రిలీజ్ అయింది.

అలెన్ కాకుండా మరో హాలీవుడ్ సంగీతకారుడు హాల్ విల్నర్ కూడా మంగళవారం మరణించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఇద్దరి సినీ తారల మృతితో సినీ ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది.


Click it and Unblock the Notifications











