కొన్నాళ్సు సినిమాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్
బ్లాక్ స్వాన్ హీరోయిన్ నటాలీ పోర్ట మెన్ తనయొక్క యాక్టింగ్ కెరియర్‌కు పుల్ స్టాప్ పెట్టి, తనకు పుట్టబోయేటటువంటి బిడ్డతో ఎక్కవ సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల చిన్నది ఈనిర్ణయాన్ని మొన్న జరిగినటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో తీసుకున్నట్లు వినికిడి. నటాలీ పోర్ట్ మెన్ గత మూడు సంవత్సరాలుగా ఎనిమిది సినిమాలలో నటించాల్సి ఉంది. త్వరగా వాటన్నింటిని పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.
దీనికంతటికి కారణం ఈ సమ్మర్‌లో నటాలీ పోర్ట్ మెన్ తన బేబికి జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సినిమాలన్నింటినీ త్వరగా పూర్తిచేసి తనయొక్క కుటుంబం మీద పూర్తిగా ఏకాగ్రత నిలపాలని కోరుకున్నట్లు నటాలీ పోర్ట్ మెన్ తెలిపారు. గతంలో నటాలీ పోర్ట్ మెన్ బ్లాక్ స్వాన్ కోరియోగ్రాఫర్ బెంజమిన్ మైల్ పిడ్‌తో ఎంగేజ్ మెంట్ అయిందని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్త కోరియోగ్రాఫర్ బెంజమిన్ మైల్ పిడ్‌తో ద్వారా నటాలీ పోర్ట్ మెన్ బేబికి జన్మనివ్వనున్న తరుణంలో తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఇక బ్లాక్ స్వాన్ సినిమా విషయానికి వస్తే ఈసినిమాలో నటాలీ పోర్ట్ మెన్, మిలా కునిస్ ఇద్దరూ లెస్బియన్లుగా నటించడం జరిగింది. ఈసినిమాలో నటించినటువంటి లెస్బియన్ పాత్రకోసం నేను చాలా కష్టపడాల్సివచ్చిందంటూ వివరణ ఇచ్చారు. అందులో భాగంగా మిలా కునిస్, నాకు మద్య వచ్చేచటువంటి రోమాంటిక్ సీన్లు చేయడానికి చాలా కష్టపడ్డానని తనదైన శైలిలో అన్నారు. బ్లాక్ స్వాన్ అనే సినిమాకుగాను నటాలీ పోర్ట్ మెన్‌కు బెస్ట్ హీరోయిన్ అవార్డుకి నామినేషన్స్‌ని సోంతం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











