twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెట్‌ఫ్లిక్స్‌‌లో రికార్డులు తిరగరాస్తున్న కొరియన్ డ్రామా.. నెల రోజుల్లో ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా?

    |

    ఓవర్ ది టాప్ (ఓటీటీ) చరిత్రలో స్క్విడ్ గేమ్ షో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నది. స్ట్రీమింగ్ హిస్టరీలోనే మెగా హిట్‌గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్‌ఫాంలో స్క్విడ్ గేమ్ సినిమా ఎన్నో కోట్లు వసూలు చేసిందంటే..

    కొరియాలోని చిన్న పిల్లలకు సంబంధించిన స్క్విడ్ గేమ్‌ను టెలివిజన్ సర్వైవల్ డ్రామాగా రూపొందించారు. ఈ వీడియో డ్రామాకు హంగ్ డాండ్ హైక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లీ జంగ్ జే, పార్క్ జే, పార్క్ హే సూ, వి హా జూన్, జంగ్ హో, అనుపమ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 17న నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.

    స్క్విడ్ గేమ్ రిలీజ్‌కు ముందే అత్యంత పాపులారిటీని సొంతం చేసుకొన్నది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన షో భారీ బిజినెస్ చేసింది. ఈ షో రిలీజ్‌కు ముందు నిర్వహించిన క్విజ్ పోటీలు సౌత్ కోరియాకు చెందిన ఈ షోకు 891.1 మిలియన్ డాలర్ల విలువను తెచ్చిపెట్టింది. ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్‌కు అయిన ఖర్చు కేవలం 2.4 మిలియన్ డాలర్లు. ఈ షో మొత్తం ఖర్చు 21..4 మిలియన్ డాలర్లుగా ట్రేడ్ వర్గాలు లెక్కకట్టాయి.

    Netflix ott content ‘Squid Game’ to be worth almost $900 million

    గత నెల రోజుల్లో స్క్విడ్ గేమ్‌ను వీక్షించిన ప్రేక్షకలు డేటాను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ చిల్డ్రెన్ డ్రామాను 132 మిలియన్ల మంది వీక్షించారు. గతంలో బ్రిడ్జెర్టన్ చిత్రం నెలకొల్పిన రికార్డును స్క్విడ్ గేమ్ తిరగరాసింది. అక్టోబర్ నెలలోనే 111 మిలియన్ల ప్రేక్షకులు చూశారు అని తన రిపోర్టులో నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఇప్పటికే ఈ చిత్రం సుమారు 900 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో రూ. 6,750 కోట్లు కొల్లగొట్టింది.

    స్క్విడ్ గేమ్ షో సెప్టెంబర్ 17 నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై ప్రభంజనం సృష్టించింది. ఈ షో రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ కంపెనీ షేరు ఉన్నట్టుండి 7 శాతం పెరిగింది. దాంతో కంపెనీ వాల్యూ 278.1 బిలియన్లకు చేరింది. దీంతో స్ట్రీమింగ్ మార్కెట్‌లో నాలుగో త్రైమాసికానికి ఈ కంపెనీ సంపద భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    నెట్‌ఫ్లిక్స్ సొంత కంటెంట్ తో పాటు అనువాదం చేసిన ఇతర టీవీ సీరీస్ లు కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే మనీ హిస్ట్ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంది. ముఖ్యంగా ఇండియాలో ఆ కంటెంట్ దాదాపు అన్ని భాషల్లో అనువాదం అయ్యి మంచి క్రేజ్ అందుకుంది. ఇక నెట్ ఫ్లిక్స్ దాని తాజా హిట్ కంటెంట్, "స్క్విడ్ గేమ్" కూడా భారీగానే వ్యూవ్స్ ను అందుకుంటోంది. త్వరలోనే మరిన్ని విభిన్నమైన సినిమాలను వెబ్ సీరీస్ లను నిర్మించేందుకు నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తోంది.

    English summary
    Netflix ott content ‘Squid Game’ to be worth almost $900 million
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X