'వేసవి లో మంచు కురిపించడానికి' బ్రిట్నీ స్పియర్స్ కొత్త ఆల్బమ్ 'ఎపిక్'..!!
'హిట్ మీ బేబీ వన్ మోర్ టైమ్', 'ఊప్స్ ఐ డిడ్ ఇట్ ఎగెయిన్' వంటి పాప్ ఆల్బమ్ లను రూపొందించిన ప్రముఖ పాప్(వివాదాల)తార బ్రిట్ని స్పియర్స్ తాజాగా రూపొందిస్తున్న ఆల్బమ్ పేరు 'ఎపిక్'. తన వివాహం వల్ల ఎదురయిన వివాదాలతో మనస్థాపం చెంది డిప్రెషన్ కు లోనయి ఇంత కాలం మ్యూజిక్ ప్రపంచానికి దూరంగా వున్న బ్రిట్నీ ఇటీవలే తన తండ్రి, మిత్రుడు ట్రావిక్ సాయం తో కోలుకొని తిరిగి సంగీతం మీద ధ్యాసపెడుతోంది. ఇటీవలే వరల్డ్ టూర్ పేరుతో ప్రపంచాన్ని చుట్టొచ్చిన బ్రిట్నీ తాజాగా ఓ ఆల్బమ్ ను రూపొందిస్తోంది. ఈ ఆల్బమ్ కు ఎపిక్ అనే పేరును ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ ఆల్బమ్ కు 'ఎలక్ట్రిసిటీ' పాట ద్వారా పాపులర్ అయిన సంగీత దర్శకుడు జాన్ అషర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆల్బమ్ గురించి మాట్లాడిన జాన్ ఈ ఆల్బమ్ కోసం ప్రత్యేకంగా ట్యూన్స్ రూపొందిస్తున్నాను. ఇది ఖచ్చితంగా జనాదరణ పొందుతుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. కాగా ఈ ఆల్బమ్ వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ ఆల్బమ్ బ్రిట్నీకు తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందని ఆయన ఆశించారు.


Click it and Unblock the Notifications











