»   » అవతార్ నాయకుడి మరో అద్భుత 3-డి చిత్రం ఎప్పుడంటే..!?

అవతార్ నాయకుడి మరో అద్భుత 3-డి చిత్రం ఎప్పుడంటే..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అతవార్' సినిమాతో మంచి గుర్తింపును పొందిన ఆస్ట్రేలియా నటుజు శ్యామ్ వర్తింగ్టన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్'. ది ఇన్క్రెబల్ హల్క్ చిత్రానికి దర్శకత్వం వహించిన లూయిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల ఏప్రిల్ 2కు వాయిదా పడింది. 3-డి పనుల్లో కొంత జాప్యం జరగడంతో ఈ వాయిదా చోటుచేసుకుందని సమాచారం. గతంలో వచ్చిన క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ సినిమా లాగా కాకుండా ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా తెరకెక్కుతోందని సమాచారం.

ఇక అవతార్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాకా శ్యామ్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం, దీనితో పాటు 3-డి చిత్రం కావడంతో ఈ సినమా మీద భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాని వార్నర్ బ్రదర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక జానీ డెప్ నటించిన "అలైస్ ఇన్ ఎ వండర్ ల్యాండ్" అనే 3-డి సినిమా ఈ వారంలో విడుదలకానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu