For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్: జేమ్స్ బాండ్ కొత్త మూవీ స్ర్కిప్టు దొంగతనం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హాలీవుడ్ సిరీస్ జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరి జేమ్స్ బాండ్ మూవీ ‘స్కై ఫాల్' 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్' షూటింగ్ ఇటీవలే మొదలైంది. లండన్ లోని పినెవుడ్ స్టూడిమోస్ సమీపంలో ఈ షూటింగ్ ప్రారంభమైంది.

    అయితే సినిమాకు కొత్త చిక్కు వచ్చి పడింది. సోనీ పిక్చర్స్ కార్యాలయంలోని కంప్యూటర్లపై దాడి చేసిన హాకర్లు సినిమా స్క్రిప్ట్ ను దొంగిలించారు. ఈ స్క్రిప్టును బటకు లీక్ చేసారని సోనీ స్టూడియో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే యూకే చట్టాల ప్రకారం స్క్రిప్ట్ కు కాపీరైట్ రక్షణ ఉందని, స్క్రిప్ట్ వివరాలు ప్రచురించినా, మరేదైనా చిత్రంలూ వాడినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా, డానియల్ క్రెగ్ హీరోగా నటిస్తున్న చిత్రం వచ్చే సంవత్సరం నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    New James Bond script taken in Sony hacking

    ‘స్కై ఫాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. గత జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించిన ముఖ్య తారాగణం రాల్ఫ్ ఫిన్నెస్ ‘ఎం' పాత్రలో, నియోమీ హారిస్ ‘ఈవ్ మనీపెన్నీ', బెన్ వైషా ‘క్యూ' పాత్రల్లో నటించబోతున్నారు. ఇతర తారాగణం వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. స్కైఫాల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన జాన్ లోగన్, నీల్ పర్విస్, రాబర్ట్ వాడ్ పని చేయబోతున్నారు. గత జేమ్స్ బాండ్ చిత్రం ‘స్కై ఫాల్' ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈసారి వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

    English summary
    Hackers have stolen a copy of the latest James Bond movie in a cyber attack on Sony Pictures. An early version of the script for film SPECTRE has been stolen by hackers who infiltrated computers at the Sony studio. Producers discovered the loss on Saturday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X