»   » వివాదం: భార్యతో పాటు టాప్ సెలబ్రిటీలందరినీ నగ్నంగా చూపిస్తూ...!

వివాదం: భార్యతో పాటు టాప్ సెలబ్రిటీలందరినీ నగ్నంగా చూపిస్తూ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సింగర్, కిమ్ కర్దాషియాన్ భర్త కెన్నీ వెస్ట్... మరోసారి భారీ వివాదానికి తెర లేపాడు. కెన్నీ వెస్ట్ తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో పలువురు హాలీవుడ్ టాప్ సెలబ్రిటీలను ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా చూపించాడు. ఈ వీడియో చూడటానికి సెలబ్రిటీలంతా నగ్నంగా ఒకరి పక్కన ఒకరు వరుసగా కనిపిస్తున్నట్లు ఉన్నా....అదంతా రియల్ కాదు. అవన్నీ సదరు సెలబ్రిటీలను పొలి ఉన్న మైనపు బొమ్మలు(వాక్స్).

ఇందులో కెన్నీ వెస్ట్ తో పాటు, అతని భార్య కిమ్ కర్ధాషియాన్ కూడా నగ్నంగా ఉండటం గమనార్హం. వీరితో పాటు అంబర్ రోజ్, డోనాల్డ్ ట్రంప్, టైలర్ షిప్ట్, రే జే, బిల్ కోస్బీ, కైట్లీన్ జెన్నర్, రిహాన్, క్రిస్ బ్రౌన్ లాంటి స్టార్స్ ఉన్నారు. అయితే ఇపుడు ఈ వీడియోపై పెద్ద దుమారమే రేగింది. తమ అనుమతి లేకుండా తమను వాక్స్ స్టాచూల రూపంలో నగ్నంగా వీడియోలో చూపడంపై పలువురు సెలబ్రిటీల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిపై హాలీవుడ్ పాప్ స్టార్ టైలర్ స్విప్ట్ మండి పడ్డారు. ఈ ఘటన తనపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు టైలర్ స్విప్ట్ చెప్పుకొచ్చారు. కెన్నీ వెస్ట్ చర్యపై ఎలాంటి మూవ్ తీసుకోవాలనే దానిపై తన టీమ్ తో కలిసి చర్చిస్తున్నట్లు టైలర్ స్విప్ట్ తెలిపారు.

ఫేమస్

ఫేమస్

ఫేమస్ పేరుతో కెన్నీ వెస్ట్ రిలీజ్ చేసిన వీడియోలో సెలబ్రిటీలందరినీ ఇలా నగ్నంగా చూపించారు.

టైలర్ స్విప్ట్

టైలర్ స్విప్ట్

తన రూపాన్ని పోలిన నగ్న వాక్స్ స్టాచ్యూను వీడియోలో వాడటంపై టైలర్ స్విప్ట్ మండి పడింది.

ఇతర సెలబ్రిటీలు

ఇతర సెలబ్రిటీలు

అంబర్ రోజ్, డోనాల్డ్ ట్రంప్, టైలర్ షిప్ట్, రే జే, బిల్ కోస్బీ, కైట్లీన్ జెన్నర్, రిహాన్, క్రిస్ బ్రౌన్ లాంటి స్టార్స్ ను ఇందులో నగ్నంగా చూపించారు.

చర్యలు తప్పవా?

చర్యలు తప్పవా?

ఇతర సెలబ్రిటీలు దీనిపై పెద్దగా రియాక్ట్ కాలేదు కానీ...టైలర్ స్విప్ట్ మాత్రం కెన్నీ వెస్ట్ మీద చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

English summary
Kanye West has never been one to shy away from controversial material, but his most recent music video for his Taylor Swift-trashing song “Famous” has some people really pissed off and petitioning for its removal.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu