సినిమాలకు 'గుడ్ బై' చెప్పనున్న స్టార్ దర్శకుడు..??
హాలీవుడ్ చిత్రం "న్యూ మూన్" ఇటీవలే విడుదలయి సంచలన విజయం సృష్టిస్తోంది. ఇంతకు మునుపు విడుదలయిన ''ట్విలైట్" చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ రికార్డులని బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన క్రిస్ వేయిట్జ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు చెప్పాడు. ది గోల్డెన్ కంపాస్ మరియు అబౌట్ ఎ బాయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన క్రిస్ సినిమాలను వదిలేసి రిలాక్స్ అవుతూ, కొత్త స్కిల్స్ ను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు మూవీ మేకర్స్ మ్యాగ్జయిన్ ఓ వార్తను ప్రచురించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నేను సినిమా తీస్తున్న ప్రతీ సారీ ఇదే ఆఖరు చిత్రం అని భావిస్తూ తీస్తుంటానని, కానీ ఈ సారి అలా చెయ్యదలచుకోలేదని, నా నుంచీ మరి ఒక చిత్రం ఉండవచ్చని" అన్నారట.
More from Filmibeat
న్యూ మూన్ క్రిస్ వేయిట్జ్ ట్విలైట్ హాలీవుడ్ ది గోల్డెన్ కంపాస్ అబౌట్ ఎ బాయ్ chris weitz hollywood new moon about a boy the golden compass good bye


Click it and Unblock the Notifications











