twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2009 వ సంవత్సరానికి ఉత్తమ సినిమా ఏదంటే..!!

    By Kuladeep
    |

    2009వ సంవత్సరంలో హాలీవుడ్ ఉత్తములు ఎవరని AOL కు సంబంధించిన moviefone.com నిర్వహించిన పోల్ లో 'ట్విలైట్' కు సీక్వెల్ గా వచ్చిన 'న్యూ మూన్' సినిమా ఈ ఏటి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా నటించిన రాబర్ట్ ప్యాటిన్సన్ సెక్సీయెస్ట్ నటుడిగా 46.5% ఓట్సతో ప్రథమ స్థానం లో నిలువగా, టేలర్ లౌటర్ ఉత్తమ బ్రేక్ అవుట్ స్టార్ నిలిచాడు. అంతే కాదు ఈ ఏడు అత్యధిక మహిళాదరణ పొందిన సినిమా గా కూడా 'న్యూ మూన్' నిలిచింది.

    ఇక ఈ సంవత్సరానికి గాను చెత్త సినిమాగా అత్యధిక మంది 'ట్రాన్స్ ఫార్మర్స్: రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్' సినిమాను ఓట్ చేసారు. దీంతో పాటు ఈ సినిమా నిరాశపరచిన చిత్రాల్లో రెండవ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో బ్రూనో సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఇక ట్రాన్స్ ఫార్మర్స్ సినిమా లో నటించిన మేఘన్ ఫాక్స్ కు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు లభించాయి. ఈ ఏడాది సెక్సీయెస్ట్ నటీమణిగా ఎంపికయిన ఈమె, ఈ ఏడాది అత్యంత దారుణం గా నటించిన నటీమణిగా అపకీర్తిని మూటకట్టుకుంది.

    'ది హ్యాంగ్ ఓవర్' సినిమా 51.8 % ఓట్లతో ఈ ఏటి ఉత్తమ హాస్య చిత్రంగా నిలువగా, డిస్నీ సంస్థ నిర్మించిన 'అప్' ఉత్తమ యానిమేషన్ చిత్రంగా నిలిచింది. ఫుట్ బాల్ క్రీడాకారుడి జీవితాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించిన సినిమా 'ది బ్లైండ్ సైడ్' లో నటించిన సాండ్రా బుల్లక్ ఈ ఏటి ఉత్తమ నటిగా కీర్తినందుకుంది. ఉత్తమ చిత్రంగా నిలిచిన ట్విలైట్ సాగా న్యూమూన్ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న 'ట్విలైట్ సాగా ఎక్లిప్స్' సినిమా 2010 లో ఎక్కువ మంది చూడాలని ఆశపడుతున్న సినిమా గా ఎంపికయింది. మొత్తానికి ఈ ఏటి అవార్డులను గమనిస్తే ట్విలైట్ సీక్వెల్లకు హాలీవుడ్ లో ఉన్న ఆదరణ అర్థమవుతుంది.

    కొసమెరుపు ఏంటంటే ఈ హాలీవుడ్ ఉత్తమ చిత్రంగా నిలిచిన న్యూ మూన్ సినిమా అమావాస్య పేరుతో తెలుగులో అనువాదమయి అపజయం పాలవగా, అవతార్, 2012 వంటి చిత్రాలు తెలుగులో యుగాంతం, అవతార్ పేర్లతో విడుదలయి రికార్డు స్థాయి విజయాన్ని సాధించాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X