బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఆ సినిమా సీక్వెల్..!!
సరిగ్గా ఏడాది క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా 'ట్విలైట్' ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన "న్యూ మూన్" సినిమా కూడా అదే విధంగా రికార్డు స్థాయిలో వసూల్లను రాబడుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా ఒక మిలియన్ పౌండ్లును వసూలు చేసిన ఈ సినిమా ఈ వారాంతానికి 85 మిలియన్ డాలర్లు వసూలు చెయ్యవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
స్టిఫెన్ మేయర్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సినిమా 'హ్యారీపోటర్ అండ్ ది హాఫ్ బ్లడ్ ప్రిన్స్' సినిమా నెలకొల్పిన రికార్డులను బద్దలుకొట్టనుందనే అంచనాలు వున్నాయి. అంచనాలన్నీ నిజమయితే ఈ సినిమా వచ్చే ఆదివారానికి 100 మిలియన్ డాలర్లు వసూలు చేసి బాక్సాఫీసు వద్ద అగ్రస్థానంలో నిలబడుతుందని ట్రేడ్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











