నెవర్ బిఫోర్ అనేలా మరో టామ్ అండ్ జెర్రీ.. అభిమానులకు పండగే
టామ్ అండ్ జెర్రీ అంటే తెలియని మనిషి ఉండడు. అప్పట్లో కార్టూన్ నెట్వర్క్ ఛానెల్ స్థాయిని పెంచిన షో అది. నాలుగు తరాల జనరేషన్స్ ని నాన్ స్టాప్ గా నవ్వించింది. వచ్చిన ఎపిసోడ్స్ ఎన్ని సార్లు రిపీట్ చేసినా కూడా బోర్ కొట్టదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు చూసేలా చాలా సరదగా ఉంటుంది. ఇప్పుడున్న పిల్లల మనసులో ఫిక్స్ అయ్యేలా అలాంటి షోలు మాత్రం రావడం లేదనే చెప్పాలి.
ఇక 1940 కాలంలో మొదలైన టామ్ అండ్ జెర్రీ ప్రస్థానం చిరస్థాయిగా అలానే ఉంటుందని అర్ధమయ్యింది. కేవలం ఎలుకను పట్టుకోవడానికి పిల్లి చేసే ప్రయత్నాలు ఇందులో ప్రధానమైన అంశం. ఇక చాలా కాలం తరువాత ప్రతిష్టాత్మక సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్స్ లో టామ్ అండ్ జెర్రీ కథను మళ్ళీ తెరపైకి తీసుకురాబోతున్నారు. ఫీచర్ ఫిలింకు యానిమేషన్ ని జోడిచ్చి ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు.

ఒక పెళ్లి వేడుకకు సిద్ధమవుతున్న తరుణంలో అనుకోకుండా జెర్రీ అక్కడి వారిని నానా ఇబ్బందులు పెడుతుంది. ఇక రంగంలోకి దిగే టామ్ తన వృత్తికి న్యాయం చేసే క్రమంలో జెర్రీని అదుపులోకి తీసుకురావాలని అనుకుంటుంది.
అందుకు సంబంధించిన ట్రైలర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. చూస్తుంటే మళ్ళీ టామ్ అండ్ జెర్రీ కథ ఆడియెన్స్ ని సరికొత్తగా ఆకట్టుకునేలా ఉందని అర్ధమవుతోంది. కోవిడ్ లేకపోయి ఉంటే సినిమాను ఈపాటికే రిలీజ్ చేసేవారు. కానీ పరిస్థితులు అనుకూలించిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది గ్రాండ్ గా విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ హౌజ్ డిసైడ్ అయ్యింది.


Click it and Unblock the Notifications











