twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెర్రర్ ఎటాక్ నుంచి తప్పించుకొన్న ప్రియాంక.. కూతవేటు దూరంలో ఉగ్రదాడి

    By Rajababu
    |

    బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు ఎగుమతి అయిన అందాల తార ప్రియాంక చోప్రా తృటిలో భారీ ఉగ్ర ప్రమాదం నుంచి తప్పించుకొన్నారు. న్యూయార్క్ సిటీలో మంగళవారం జరిగిన టెర్రర్ ఎటాక్ ప్రియాంక నివాసానికి కూతవేటు దూరంలో జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది పాదాచారులు మృత్యువాత పడ్డారు.

    ప్రియాంక చోప్రా నటిస్తున్న క్వాంటికో టీవీ షో మూడో సీజన్ కోసం ఆమె షూటింగ్ చేస్తుండగా ఉగ్రదాడి చోటుచేసుకొన్నది. మ‌ృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సంతాపం తెలిపారు.

    ప్రియాంక నివాసానికి కూతవేటు

    ప్రియాంక నివాసానికి కూతవేటు

    నేను షూటింగ్ చేస్తున్న ప్రదేశానికి ఐదు బ్లాకుల దూరంలో ఉగ్రదాడి జరిగింది. ఆ పేలుడు శబ్దం నాకు స్పష్టంగా వినిపించింది. చాలా దారుణమైన సంఘటన. పేలుళ్ల శబ్దం వినిపించగానే షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిపోయాను అని ప్రియాంక ట్వీట్ చేసింది.

     న్యూయార్క్ సిటీ బెదిరిపోలేదు..

    న్యూయార్క్ సిటీ బెదిరిపోలేదు..

    పేలుళ్ల శబ్దాలు ఈ ప్రపంచం ఏమిటో అనే విషయాన్ని నాకు చెప్పకనే చెప్పాయి. ఈ తాటకు చప్పుళ్లకు న్యూయార్క్ సిటీ బెదిరిపోకుండా ధైర్యంగా నిలబడింది. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం మరో ట్వీట్‌లో ఆమె పేర్కొన్నది.

     కిడ్నాప్ ఎపిసోడ్‌ను షూట్

    కిడ్నాప్ ఎపిసోడ్‌ను షూట్

    ఇదిలా ఉండగా, క్వాంటికో షూటింగ్‌లో భాగంగా కిడ్నాప్ ఎపిసోడ్‌ను షూట్ చేశారు. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటివరకు ప్రియాంక దాదాపు 13 ఏపిసోడ్స్ పూర్తిచేసింది. మిగితా ఎపిసోడ్స్ కోసం ఆమె న్యూయార్క్‌లో ఉంటున్నది.

     జనవరి 2018లో మూడో సీజన్

    జనవరి 2018లో మూడో సీజన్

    క్వాంటికో సిరీస్‌లో ప్రియాంక ఎఫ్‌బీ‌ఐ ఆఫీసర్‌గా పనిచేస్తున్నది. గత రెండు ఎపిసోడ్స్‌కు అమెరికాలో చాలా చెత్తగా రేటింగ్ వచ్చాయి. అయితే అవన్నీ పక్కనపెట్టి ఏబీసీ న్యూయార్క్ మూడో సీజన్‌కు సిద్ధమైంది. ఈ మూడో సీజన్ జనవరి 2018లో ప్రారంభం కానున్నది.

    English summary
    Priyanka Chopra was spotted filming the third season of her TV show Quantico in New York hours before the terror attack that killed 8 people happened in the city. Eight people were killed in an attack labelled as ‘terrorism’ when a driver ploughed through cyclists and pedestrians in New York City. Priyanka condemned the attack in a tweet, saying that she heard “dreary sirens” as she headed back home after work. She also offered her condolences to “everyone affected by the tragedy.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X