విడాకులు తీసుకున్న తర్వాత రెచ్చిపోయి తిరుగుతున్న హీరోయిన్

ప్రముఖ వెబ్ సైట్ అయిన షోబిజినెస్ వీరిద్దరూ కలసి డిన్నర్‌కి న్యూయార్క్ వీధిలోని ట్రెండీ రెస్టారెంట్ 'పీర్ సీ'కి వెళ్లినట్లు రాయడం జరిగింది. దీనితో పాటు ప్రముఖ టిఎమ్‌జడ్ వెబ్ సైట్ కూడా వీరిద్దరి డిన్నర్‌ని రొమాంటిక్ డిన్నర్‌గా అభివర్ణించింది. 42 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ లోపెజ్ జులై 15వ తారీఖున తన భర్త మార్క్ ఆంటోనీ నుండి విడపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్‌తో డేటింగ్ చేస్తున్న బ్రాడ్లీ కూపర్ కూడా ఒక సంవత్సరం పాటు హీరోయిన్ రీనీ జెల్లవేగర్‌తో డేటింగ్ చేసి మార్చిలోనే ఇద్దరూ విడిపోయారు.
గతంలో కూడా బ్రాడ్లీ కూపర్కి ఓలివా విల్డ్, జెన్నిఫర్ ఆనిస్టన్‌తో డేటింగ్ చేసిన సందర్బాలు ఉన్నాయి. ఇక జెన్నిఫర్ లోపెజ్ కూడా బ్రాడ్లీ కూపర్ కంటే ముందు తన సొంత ఆల్బమ్‌లో నటించిన విలియమ్ లెవీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సన్నిహిత సంబంధం వల్లనే తన భర్త మార్క్ ఆంటోనీ జెన్నిఫర్ నుండి విడిపోవడానికి ఒక కారణం అని కూడా అంటున్నారు. జెన్నిఫర్, విలియమ్ ఇద్దరూ కూడా ఆ వీడియో సాంగ్‌లో రెచ్చిపోయి మరీ తమ అందాలను ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications











