twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడాకులు తీసుకున్న తర్వాత రెచ్చిపోయి తిరుగుతున్న హీరోయిన్

    By Nageswara Rao
    |

    Jennifer Lopez-Bradley Cooper
    ఏడు సంవత్సరాలు పాటు తన భర్త మార్క్ ఆంటోనీతో కలసి జీవించి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా జీవితం గడుపుతున్న జెన్నిఫర్ లోపెజ్ ఇప్పడు కొత్త బాయ్ ప్రెండ్‌ని వెతుక్కుందని హాలీవుడ్ కొడై కూస్తుంది. సింగర్, హీరోయిన్‌గా యావత్ ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరోయిన్ నిన్న రాత్రి న్యూయార్క్ వీధుల్లోని రెస్టారెంట్‌లో హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్లీ కూపర్‌తో ఎంజాయ్ చేస్తూ పబ్లిక్‌గా కనిపించింది. దాంతో అభిమానులు హాలీవుడ్లో ఇలాంటివి అన్ని సర్వసాధారణం అని అంటున్నారు.

    ప్రముఖ వెబ్ సైట్ అయిన షోబిజినెస్ వీరిద్దరూ కలసి డిన్నర్‌కి న్యూయార్క్ వీధిలోని ట్రెండీ రెస్టారెంట్ 'పీర్ సీ'కి వెళ్లినట్లు రాయడం జరిగింది. దీనితో పాటు ప్రముఖ టిఎమ్‌జడ్ వెబ్ సైట్ కూడా వీరిద్దరి డిన్నర్‌ని రొమాంటిక్ డిన్నర్‌గా అభివర్ణించింది. 42 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ లోపెజ్ జులై 15వ తారీఖున తన భర్త మార్క్ ఆంటోనీ నుండి విడపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్‌తో డేటింగ్ చేస్తున్న బ్రాడ్లీ కూపర్ కూడా ఒక సంవత్సరం పాటు హీరోయిన్ రీనీ జెల్లవేగర్‌తో డేటింగ్ చేసి మార్చిలోనే ఇద్దరూ విడిపోయారు.

    గతంలో కూడా బ్రాడ్లీ కూపర్కి ఓలివా విల్డ్, జెన్నిఫర్ ఆనిస్టన్‌తో డేటింగ్ చేసిన సందర్బాలు ఉన్నాయి. ఇక జెన్నిఫర్ లోపెజ్ కూడా బ్రాడ్లీ కూపర్ కంటే ముందు తన సొంత ఆల్బమ్‌‍లో నటించిన విలియమ్ లెవీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సన్నిహిత సంబంధం వల్లనే తన భర్త మార్క్ ఆంటోనీ జెన్నిఫర్ నుండి విడిపోవడానికి ఒక కారణం అని కూడా అంటున్నారు. జెన్నిఫర్, విలియమ్ ఇద్దరూ కూడా ఆ వీడియో సాంగ్‌లో రెచ్చిపోయి మరీ తమ అందాలను ప్రదర్శించారు.

    English summary
    She is newly single after splitting with her husband of seven years, Marc Anthony. But it seems Jennifer Lopez may have already found herself a new man. The singer and actress was spotted enjoying a date with actor Bradley Copper in New York last night, according to TMZ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X