సెక్సీ జోడీ: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: దాదాపు ఏడెనిమిదేళ్లుగా సహజీవనం అనంతరం హాలీవుడ్ సెక్సీ జోడీ బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ పెళ్లి చేసుకున్నారు. దంపతులయ్యారు. 2005 నుండి కలిసి సహజీవనం చేస్తున్న ఈ ఇద్దరూ 2012లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్రాన్స్‌లో వీరి వివాహం జరిగింది.
ఈ ఏడేళ్ల సహజీవనంలో ఈ జంట ముగ్గు పిల్లలకు జన్మనివ్వగా...మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. హాలీవుడ్ హాట్ జోడీ అయిన బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలిలను కలిపి......ముద్దుగా 'బ్రాంజలీనా' అని పిలుచుకుంటారు అభిమానులు. మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా వీరు పేరు తెచ్చుకున్నారు.
2005లో వచ్చిన 'మిస్టర్ అండ్ మిస్టర్స్ స్మిత్' చిత్రంలో కలిసి నటించిన ఈ జోడీ ప్రేమలో పడి పోయాడు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ.....ఒకరి కోరికలను మరొరు ఆస్వాదిస్తూ చూడముచ్చటైన ప్రేమ జంటగా పేరు తెచ్చుకున్నారు. స్లైడ్ షోలో బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీకి సంబంధించిన ఫోటోస్...

హనీ మూన్
ఇటీవలే పెళ్లాడిన ఈ జంట ప్రస్తుతం గోజో ఐలాండ్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.

ఫ్రాన్స్‌లో వివాహం
ఇటీవల ఫ్రాన్స్‌లో వీరి వివాహం సాధారణంగా జరిగింది. వీరి వివాహానికి కేవలం 66 మంది గెస్టులు మాత్రమే హాజరయ్యారు.

ఆరుగురు పిల్లలు
ఈ జంటకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ముగురికి వీరు స్వయంగా జన్మనివ్వగా, మరో మగ్గురిని దత్తత తీసుకున్నారు.

చేతిలో చెయ్యేసి
దాదాపు దశాబ్ద కాలంగా వీరు డేటింగ్ చేస్తున్నారు. ఇన్నేళ్ల కాలంలో వీరు ఒకరి చేతిని ఒకరు విడువలేదు.

ఎప్పుడో ఏకమయ్యారు
కొన్నేళ్లుగా వీరు పెళ్లయిన దంపతులుగానే జీవిస్తున్నారు. జస్ట్ సమాజం గుర్తింపు కోసం ఇటీవల అందరి సమక్షంలో వివాహం చేసుకున్నారు.

ఒకరికొకరు మద్దతుగా
ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ఆదర్శవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు.

చిలిపి...
పడక గదిలో మాత్రమే కాదు...ఇలా పబ్లిక్‌లోనూ ఏంజలీనాతో చిలిపి పనులు చేస్తుంటాడు బ్రాడ్ పిట్.

రొమాంటిక్
బ్రాడ్ పిట్, ఏంజలీనాలకు సంబంధించిన రొమాంటిక్ ఫోటోల్లో ఇదీ ఒకటి.

ఆస్కార్ కిస్
ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న సందర్భంగా బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ ముద్దు.


Click it and Unblock the Notifications











