ప్రముఖ హీరోయిన్ మీద ఆ వార్త చూసి అంతా షాక్... ఆమె ‘హోల్స్’ అంటూ!
హాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలిన నటీమణుల్లో జూలియా రాబర్ట్స్ ఒకరు. ఒకప్పుడు తన అందంతో యువతను ఉర్రూతలూగించిన ఈ నటి ఆస్కార్ అవార్డ్ సైతం దక్కించుకున్నారు. ఇప్పటికీ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇటీవల 51వ వసంతంలోకి అడుగు పెట్టిన జూలియా రాబర్ట్ మీద ఇటీవల న్యూయార్క్‌కు చెందిన ఓ పత్రిక ఒక ప్రత్యేక కథనం వెలువరించింది. అయితే ఆ కథనం హెడ్ లైన్లో కనిపించిన భారీ తప్పిదం చూసి అభిమానులు షాకయ్యారు.

‘హెల్స్' అంటూ....
‘జూలియా రాబర్ట్స్ ఫైండ్స్ లైఫ్ అండ్ హోల్స్ గెట్ బెటర్ విత్ ఏజ్' అనే శీర్షిక అందరినీ ఆశ్చర్య పరిచింది. ‘రోల్స్' అనే పదానికి బదులు ‘హోల్స్' అని అచ్చు తప్పు పడటంతో అదో పెద్ద బూతుగా మారిపోయింది.
ట్విట్టర్లో పేలుతున్న జోకులు
జూలియా రాబర్ట్స్ గురించి ఈ హెడ్ లైన్ చూసి ట్విట్టర్లో జోక్స్ పేలుతున్నాయి. ఇందులో చాలా డబల్ మీనింగ్ ఉందంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆమె మీద వచ్చిన ఈ కథనం నెటిజన్లను తెగ నవ్విస్తోంది.
జూలియా రాబర్ట్స్
జూలియా రాబర్ట్స్ 1988లో ‘సాటిస్ఫాక్షన్' అనే సినిమా ద్వారా నటిగా తన కెరీర్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 50కి పైగా హాలీవుడ్ సినిమాలతో పాట, 20కి పైగా టీవీ సిరీస్ చేశారు. ఇన్నేళ్ల కాలంలో తన గురించి ఎన్నో పత్రికలు కథనాలు రాశాయి కానీ... ఇలాంటి బ్లండర్ మిస్టేక్ ఎప్పుడూ జరుగలేదు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు
జూలియా రాబర్ట్స్ ప్రస్తుతం ‘హోమ్ కమింగ్' అనే అమేజాన్ వీడియో సిరీస్‌లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘బెన్ ఈజ్ బ్యాక్' అనే చిత్రం గతవారం అమెరికాలో విడుదలై మంచి విజయం అందుకుంది.


Click it and Unblock the Notifications











