రూ. 12 కోట్ల విలవైన బూట్లు ధరించిన నటుడు
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ నిక్ క్యానన్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి వేసుకొచ్చిన షూలు హాట్ టాపిక్ అయ్యాయి. అయినా పాదాలకు వేసుకునే షూలలో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? ఉంది కాబట్టే ఈ చర్చ. ఆయన ధరించిన షూల ఖరీదు 2 మిలియన్ అమెరికన్ డాలర్స్(దాదాపు రూ. 12 కోట్లు).

ఇంత ఖర్చు పెట్టడానికి అందులో ఉపయోగించిన వజ్రాలే కారణం. ఆయన ధరించిన టాప్ ఫోర్డ్ షూలలో ఏకంగా 14వేలకు పైగా వజ్రాలు పొదిగారు. మేలిమి లెదర్ షూలపై ముందు వైట్ గోల్డ్‌తో కోటింగ్ ఇచ్చి...ఆ వైట్ గోల్డ్ లో ఈ ఫుల్ కట్ రౌండ్ వైట్ వజ్రాలు(340 క్యారెట్స్)ను పొదిగారట.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన షూ ఇదేనట. ఇదీ ఒక రికార్డే అంటూ కథనాలు వెలువరించాయి యూఎస్ మేగజైన్స్. ఈ బూట్లను తయారు చేసింది ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ జాసన్ ఆరాషెబెన్. గత సంవత్సరం నిక్ తన వద్దకు వచ్చాడని, హిస్టరీ సృష్టించి టాప్ లో ఉండే విధంగా ఏదైనా చేద్దాం అన్నారు. అలా ఈ షూ డిజైన్ చేసామని జాసన్ తెలిపారు. త్వరలో ఈ షూలను చారిటీ కార్యక్రమం కోసం వేలం వేయనున్నారట.


Click it and Unblock the Notifications











