twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా భార్యకు కూడా అంతే.. జస్ట్ కూల్.. ఏజ్ గ్యాప్‌పై నిక్ జోనాస్

    |

    ప్రముఖ గాయకుడు నిక్ జోనాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకున్న నిక్ జోనాస్.. ఇండియాలో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ప్రియాంక భర్తగా ప్రతీ ఒక్కరికి పరిచయమే. అయితే వీరిద్దరి జంటను అందరూ ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే వీరిద్దరి వయో భేదం పదేళ్లు. అవును తప్పేముంది అంటారా? అందులో ప్రియాంకకు 37 నిక్ జోనాస్‌కు 17. ఈ వ్యవహారాన్ని మన దేశంలో విడ్డూరంగానే చూస్తారు. ఇండియాలో భర్త వయసు ఎక్కువగా ఉండాలి.. భార్య వయసు తక్కువగా ఉండాలి. అయితే వయోభేదంపై నిక్ జోనాస్ తాజాగా స్పందించాడు. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

    బాలీవుడ్ టు హాలీవుడ్..

    బాలీవుడ్ టు హాలీవుడ్..

    బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ప్రియాంక హాలీవుడ్ చిత్రాల్లో అక్కడి సీరియల్స్ నటించడంతో ఫుల్ ఫేమస్ అయింది. అక్కడున్న సమయంలోనే గాయకుడు నిక్ జోనాస్‌తో ప్రేమలో పడింది. కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. కలిసి ఫంక్షన్లకు కూడా వెళ్లేవారు. అలా తిరగడంతోనే వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు హల్ చల్ చేశాయి.

    ప్రేమబంధంతో ఒక్కటై..

    ప్రేమబంధంతో ఒక్కటై..

    అలా ప్రేమ వ్యవహారాన్ని నడిపించి.. చివరకు పెళ్లితో ఒక్కటయ్యారు. 2018 డిసెంబర్ 1న వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. క్రైస్తవ సాంప్రదాయ పద్దతిలో రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది. తర్వాత డిసెంబర్ 3న హిందూ సాంప్రదాయ పద్దతిలో మరోసారి వీరి వివాహం జరిగింది.

    రకరకాల కథనాలు..

    రకరకాల కథనాలు..

    పెళ్లైన కొత్తలో వీరిద్దరిపై రోజుకో రకమైన వార్తలు వచ్చేవి. ఒకానొక దశలో వీరిద్దరు విడాకులు తీసుకోబోతోన్నారని వార్తలు వచ్చాయి. వీటిపై ప్రియాంక, ఆమె తల్లి కూడా ఫైర్ అయింది. అవన్నీ తప్పుడు వార్తలని ఖండించారు. ఇలా ఏదోకటి వస్తూనే ఉంటాయి. కానీ ఇవేవీ వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను తగ్గించలేకపోయాయి. బయటి ఫంక్షన్లలో వీరు కనబడే తీరును చూస్తే వారి అన్యోన్యత గురించి తెలుస్తోంది.

    నా భార్య ఏజ్ కూడా అంతే..

    నా భార్య ఏజ్ కూడా అంతే..

    నిక్ జోనాస్ తాజాగా ది వాయిస్ అనే కార్యక్రమంలో పాల్గొంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కో యాంకర్‌గా ఉన్న కెల్లీ క్లార్క్‌సన్.. ఏదో సరదాగా మాట్లాడుకుంటూ.. నేను 37 నువ్వు 27 అంటూ కౌంటర్ వేసింది. నా భార్యకు కూడా 37 నాకు 27 అయితే ఏంటీ జస్ట్ కూల్ అంటూ మనోడు బదులిచ్చాడు. అంటే వారికి ఏజ్ అనేది జస్ట్ నంబర అన్నమాట.

    English summary
    Nick Jonas About Priyanka Chopra And Their Age Gap. The Voice Season 18 Show Nick Jonsa Replies Funny Ans to Co Anchor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X