బాలీవుడ్ పాటకు దుమ్ము రేపిన నిక్, ప్రియాంక చోప్రా.. వాలంటైన్ డే రోజున సీటీమార్ (వీడియో)
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, తన భర్త పాప్‌స్టార్ నిక్ జోనాస్‌తో వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తుందనే విషయం తను షేర్ చేసే వీడియోలు, ఫోటోల ద్వారా స్పష్టమవుతున్నది. తాజాగా ఈ స్టార్ కపుల్ తమ వాలంటైన్ డేను ఘనంగా జరుపుకొన్నారు. ప్రేమికుల రోజున బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసి హంగామా చేశారు. ఇంతకు ఆ బాలీవుడ్ పాట ఏమిటంటే.. సింబా చిత్రంలోని ఆంఖే మారే రీమిక్స్ పాటకు దుమ్మురేపేలా ప్రియాంక, నిక్ డ్యాన్స్ చేశారు.
బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను నిక్ జోనాస్ మీడియాలో షేర్ చేసి తన సంతోషాన్ని పంచుకొన్నారు. ఈ వీడియో నా వాలంటైన్ డే రోజుకు ముందు ప్రీ షో డ్యాన్స్ అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ మెసేజ్ పెట్టారు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇన్స్‌టాగ్రామ్ వీడియోకు 20 లక్షలకుపైగా వ్యూస్ రావడం గమనార్హం.

వాలంటైన్ డే కోసం ఇటలీలోని మిలాన్‌కు వెళ్లిన ఈ ప్రేమ పక్షులు హోటల్ రూమ్‌లో ఆంఖే మారో రీమిక్స్ పాటపై తమ జోరును ప్రదర్శించారు. ఈ వీడియోపై కామెంట్లు విసురుతూనే ఫ్యాన్స్ వారికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అందజేశారు.
View this post on InstagramPre show dance party with my forever Valentine. @priyankachopra #valentines
A post shared by Nick Jonas (@nickjonas) on
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ 2018 డిసెంబర్ 1వ తేదీన హిందూ, క్రిస్టియన్ వివాహ పద్దతుల్లో పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమేద్ భవన్ ప్యాలెస్‌లో జరిగిన వివాహానికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరు కావడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











