ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
అందాల తార ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ జంట దేశంలోనే కాకుండా విదేశీ గడ్డపై కూడా హాట్ కపుల్‌గా పేరు తెచ్చుకొన్నది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న జంట అన్యోన్యయంగా కాపురం చేస్తూ.. నిన్ను విడిచి నేను ఉండలేను అదే విధంగా కనిపిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ సమయంలో అమెరికాలో చిలకా గోరింకల్లా కలిసి ఉన్న వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ లభించింది. అయితే ఆ గ్యాప్‌ను నిక్ జోనస్ తట్టుకోలేక విరహా వేదనను అనుభవిస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే...

స్సేస్‌మెన్ మ్యూజిక్ ఆల్బమ్‌తొ
నిక్ జోనస్ తన సోలో అల్బమ్ స్సేస్‌మెన్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. తన మ్యూజిక్ ఆల్బమ్ ను ఆయన మరో రేంజ్‌కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా తనను వదలి జర్మనీకి వెళ్లిపోయింది. దాంతో నిక్ జోనస్ ఒంటరిగా మారిపోయారు.

ప్రియాంక మ్యాట్రిక్స్ 4 షూటింగులో
ప్రియాంక చోప్రా దూరం కావడంపై నిక్ జోనస్ తాజా ఇంటర్వూలో తన విరహా వేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా మ్యాట్రిక్స్ 4 షూటింగు కోసం జర్మనీకి వెళ్లింది. దాంతో నాకు ఏమి చేయాలో తోచడం లేదు అంటూ నిక్ వెల్లడించారు.

నా పక్కన లేకపోవడంతో పిచ్చిగా
నా భార్య జర్మనీలో ఉంది. మ్యాట్రిక్స్ సినిమా షూటింగుకు సంబంధించి మిగిలిన సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. ఆమె నా పక్కన లేకపోవడంతో ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయనే ఫీలింగ్ ఏర్పడింది. ఏదో కొత్త గ్రహం మీద ఉన్నట్టు అనిపిస్తున్నది అని నిక్ జోనస్ పేర్కొన్నారు.

అన్‌ఫినీష్డ్ పుస్తకంతో క్రేజీగా
ప్రియాంక విషయానికి వస్తే.. తన జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలను ఆధారంగా చేసుకొని అన్‌ఫినీష్డ్ అనే పుస్తకాన్ని పాఠకుల ముందుకు తెచ్చింది. ఆ పుస్తకం అమెరికాలో బెస్ట్ సెల్లింగ్‌గా రికార్డును సొంతం చేసుకొన్నది. విమర్శకులు కూడా అన్‌ఫినీష్డ్ పుస్తకంపై మంచి రివ్యూలు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











