డేటింగ్ చేసినోళ్లలో ప్రియాంక మాత్రమే.. కలవడానికంటే ముందే అన్నీ: పర్సనల్ మేటర్ లీక్ చేసిన నిక్ జోనస్

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే సినీ ప్రియులను అలరిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది అందాల తార ప్రియాంక చోప్రా. భారతదేశంలోని చాలా భాషల్లో నటించిన ఈ అమ్మడు.. అన్ని చోట్లా తనదైన మార్క్ చూపించింది. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అదే సమయంలోనే పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడిని వివాహం కూడా చేసుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిక్.. ప్రియాంక గురించి పర్సనల్ సీక్రెట్స్ లీక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

టీనేజ్‌లోనే ప్రపంచాన్నే గెలిచిన ప్రియాంక

టీనేజ్‌లోనే ప్రపంచాన్నే గెలిచిన ప్రియాంక

చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే చాలా షోలలో క్యాట్ వాక్ చేసిన ఈ అమ్మడు.. 2000లో జరిగిన అందాల పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన పీసీ.. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా అన్ని భాషల్లో నటిస్తూ తన హవాను చూపిస్తోంది. దీంతో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకుందామె.

హాలీవుడ్‌లోకి ఎంట్రీ.. పాప్ సింగర్‌తో పెళ్లి

హాలీవుడ్‌లోకి ఎంట్రీ.. పాప్ సింగర్‌తో పెళ్లి

సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకుని ఇండియాలో బెస్ట్ హీరోయిన్‌గా కితాబందుకుంది ప్రియాంక. ఇక్కడ తన మార్క్ చూపించిన ఈ భామ.. హాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించింది. ఆ సమయంలోనే అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. వయసులో చిన్నోడే అయినా రహస్యంగా డేటింగ్ చేసింది. ఆ తర్వాత నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకుంది.

మారిపోయిన కల్చర్.. ప్రియాంకపై ట్రోల్స్

మారిపోయిన కల్చర్.. ప్రియాంకపై ట్రోల్స్

హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా ప్రవర్తనలో పూర్తిగా మార్పులు వచ్చాయి. అందాలు కనువిందు చేసేలా డ్రెస్‌లు వేసుకోవడంతో పాటు డ్రింకింగ్ పార్టీలు వంటి చేస్తూ కనిపించింది. అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడా అలవాటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో వైరల్‌గా మారడంతో విమర్శలు వచ్చాయి.

‘అన్‌ఫినీష్‌డ్'తో ప్రకంపనలు రేపిన బ్యూటీ

‘అన్‌ఫినీష్‌డ్'తో ప్రకంపనలు రేపిన బ్యూటీ

ప్రియాంక చోప్రా ఇటీవల 'అన్‌ఫినీష్‌డ్' పేరుతో పుస్తక రూపంలో తన ఆత్మకథను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఎన్నో అంశాలను అందులో ప్రస్తావించిందామె. కొందరు దర్శక నిర్మాతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, బట్టలు తీసి చూపించమన్నారని, సర్జరీలు చేయించుకోమన్నారని సంచలన ఆరోపణలు చేసింది ప్రియాంక.

పర్సనల్ మేటర్ రివీల్ చేసిన నిక్ జోనస్

పర్సనల్ మేటర్ రివీల్ చేసిన నిక్ జోనస్

ప్రియాంక చోప్రాతో పోలిస్తే నిక్ జోనస్ పెద్దగా మీడియా ముందుకు రాడు. సోషల్ మీడియాలో కూడా ఆమెలా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు 'స్పేస్ మాన్' అనే కొత్త ఆల్బమ్‌ను రూపొందించాడు. దీని ప్రమోషన్ కోసం కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన మేటర్ రివీల్ చేశాడు.

డేటింగ్ చేసిన వాళ్లలో ప్రియాంక మాత్రమే

డేటింగ్ చేసిన వాళ్లలో ప్రియాంక మాత్రమే

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన భార్య ప్రియాంక చోప్రాతో పరిచయం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు నిక్ జోనస్. 'ఈ భూమి మీద ఉన్న మహిళలందరిలో ప్రియాంక అందమైనది. నేను డేటింగ్ చేసిన అమ్మాయిలందరిలోనూ ఆమె చాలా స్పెషల్. తన లాంటి భార్య ఉండడం నా అదృష్టం. అంతలా ప్రతి విషయంలోనూ నన్ను అర్థం చేసుకుంటుంది' అంటూ చెప్పుకొచ్చాడతను.

కలవడానికంటే ముందే అన్నీ తెలుసంటూ

కలవడానికంటే ముందే అన్నీ తెలుసంటూ

పెళ్లికి ముందు ప్రియాంకతో ఏర్పడిన బంధం గురించి చెబుతూ.. 'మా ఇద్దరి మధ్య వివాహ బంధం కంటే ముందు స్నేహం ఉంది. మేము డేటింగ్ ప్రారంభించడానికి ముందు ఒకరినొకరు బాగా తెలుసు. అన్నీ విషయాలు మాట్లాడుకున్నాం అందుకే మా మధ్య మంచి బంధం ఏర్పడింది. అదే మా విషయంలో సమన్వయం కుదరడానికి చాలా ఉపయోగపడింది' అన్నాడు నిక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X