స్టార్ హిరోయిన్ ట్విట్టర్ ఎకౌంట్‌ని తొలగించడానికి కారణం..?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ బాగా ప్రాచుర్యం పొందిన రోజులివి. అలాంటి ట్విట్టర్ నుండి ఎవరైనా ఎకౌంట్‌ని తొలిగిస్తారా..? కానీ హాలీవుడ్ రాపర్ నిక్కీ మినాజ్ మాత్రం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ నుండి ఎకౌంట్‌ని తొలగించారు. ఇందుకు గల కారణాలను అన్వేషిస్తే నిక్కీ మినాజ్‌కు సంబంధించిన మ్యూజిక్ ట్రాక్స్ ఆన్ లైన్‌లో లీక్ అవ్వడంతో కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిక్కీ మినాజ్ ఇటీవల కొత్తగా విడుదల చేయాలని భావించిన ఆల్బమ్ 'పింక్ ప్రైడే: రోమన్ లీడెడ్' కు సంబంధించిన ఆడియో ట్రాక్స్ కొన్ని నిక్కీ డైలీలో పోస్ట్ చెయ్యడంతో నిక్కీ మినాజ్ కోపోద్రక్తురాలైంది. దీంతో తన ట్విట్టర్ ఎకౌంట్‌ని పూర్తిగా తొలగించి వేయడమే కాకుండా తిరిగి మళ్లీ ట్విట్టర్ ఎకౌంట్‌ని ఓపెన్ చెయ్యనని శపథం చేసింది.
చివరగా తన ట్విట్టర్ ఎకౌంట్లో నా ట్విట్టర్ ఎకౌంట్‌ని తొలగిస్తున్నాను. నా కోసం అర్జెంటీనా ఏడవాల్సిన అవసరం లేదు. ఇదంతా కేవలం ఒకే వ్యక్తి వల్ల జరగడం బాధాకరం అని ట్విట్ చేసింది.


Click it and Unblock the Notifications











