కొంపముంచిన దొంగలు...హీరోగారి సెక్స్ ఫోటోలు అపహరణ!
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటుడు నికోలస్ కేజ్ ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడితే విలువైన వస్తువులు ఎత్తుకెళుతారు. డబ్బు పడేస్తే మళ్లీ ఆ ఎలాంటి వస్తువైనా మళ్లీ కొనుకోవచ్చు. కానీ దొంగులు ఎత్తుకెళ్లింది అంతకంటే విలువైన, తిరిగి తెచ్చుకోలేని వస్తువులు. నికోల్ కేజ్ తన మాజీ ప్రియురాలు క్రిష్టినా ఫుల్టన్‌తో దిగిన ఎక్స్ రేటెడ్ సెక్స్ ఫోటోలు ఎత్తుకెళ్లారట దొంగలు.
ఈ సంవత్సరం మొదట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పటికీ ఆ ఫోటోలు రికవరీ కాలేదు. ఇంతకాలం గుట్టుగా ఉన్న ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం...నికోలస్ కేజ్-క్రిష్టినా ఫుల్టన్ దిగిన ఈ శృంగార భరిత ఫోటోలను రికార్డో ఓరోజ్కో అనే వ్యక్తి అపహరించాడు.

ఏప్రిల్ నెలలో జరిగిన ఈ సంఘటనలో నాలుగు కంప్యూటర్లు, ఫోటోలతో కూడిన బాక్సు అపహరించబడ్డాయి. గత నెలలో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు దోపీడీ నేరం కేసు నమోదు చేసారు. అయితే అతని వద్ద నుంచి సదరు ఫోటోలు మాత్రం పోలీసులు రికవరీ చేయలేక పోయారు. తాను ఆ నేరం చేసినట్లు అస్సలు ఒప్పుకోవడం లేదట రికార్డో ఓరోజ్కో. ప్రస్తుతం అతను భారీ మిలియన్ డాలర్లు చెల్లించి బెయిల్ పై ఉన్నాడట. పరిస్థితి చూస్తుంటే అతను ఆ ఫోటోలను భారీ ధరకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











