ప్రముఖ హీరో భార్యకు మరొకరితో సంబంధం.. పెళ్లైన నాలుగో రోజుకే విడాకులు

హాలీవుడ్‌లో వివాహా బంధాలకు అంతగా ప్రాధాన్యం ఉండదనే విషయం మరోసారి రుజువైంది. ప్రముఖ నటుడు నికోలాస్ కేజ్ దాంపత్య జీవితం మరోసారి విఫలమైంది. పెళ్లైన నాలుగో రోజుకే వైవాహిక జీవితానికి తెరపడటం హాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. పెళ్లైన నాలుగు రోజునే తనను మోసం చేసి పెళ్లి చేసుకొన్నదనే ఆరోపణలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వారి సంసార జీవితం ఆదిలో ముగిసింది. వివారాల్లోకి వెళితే..

మార్చి 23న పెళ్లి

మార్చి 23న పెళ్లి

నికోలాస్ కేజ్, ఎరికా కోయికే వివాహం మార్చి 23న జరిగింది. ఆ తర్వాత 4వ రోజునే వారు విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. తాము కలిసి ఉండే పరిస్థితి లేదు. మా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. మేము విడాకులు తీసుకోవడమే శరణ్యం అంటూ పిటిషన్ దాఖలు చేశారు. మా వివాహాన్ని రద్దు చేయమని కోర్టును వేడుకొన్నారు. దాంతో వారి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొని విచారణ చేపట్టింది.

 పెళ్లి వేదిక వద్దే గొడవలు

పెళ్లి వేదిక వద్దే గొడవలు

నికోలాస్ కేజ్, ఎరికా పెళ్లి జరిగిన కొద్ది గంటలకే వారిద్దరూ వివాహ వేదిక వద్దే కొట్టుకోవడం మీడియా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులపాటు వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి. దాంతో వారిద్దరు కలిసి ఉండలేమని నిర్దారణకు వచ్చారు. వెంటనే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు నికోలాస్ కేజ్ సన్నిహితులు తెలిపారు.

నాకు జీవనభృతి చెల్లించాలని

నాకు జీవనభృతి చెల్లించాలని

నికోలాస్ కేజ్‌తో వివాహ రద్దుకు ఎరికా మెలిక పెట్టింది. విడాకులు ఇస్తే.. తనకు జీవనభృతి కింద కొంత మొత్తం చెల్లించాలని పట్టుబట్టింది. నికోలాస్‌ కేజ్‌తో సర్దుకుపోవాలని ప్రయత్నించాను. కానీ వైవాహిక జీవితానికి తాము సరిపోమని తెలుసుకొన్నాను. అయితే నాకు జీవనభృతిని కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కేజ్‌తో పెళ్లి వల్ల చాలా అవకాశాలు కోల్పోయాను. ఆయన ఆరోపణలతో నా ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లింది. నాకు జీవనభృతిని కల్పిస్తే విడాకులు ఇవ్వడానికి సిద్ధం అని ఎరికా కోర్టుకు వెల్లడించింది.

మే 31న అధికారికంగా విడాకులు

మే 31న అధికారికంగా విడాకులు

హలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. నేవడాలోని క్లార్క్ కౌంటీ నికోలాస్ కేజ్‌కు, ఎరికాకు మే 31న విడాకులు మంజూరు చేసింది. తన క్లయింట్ కేజ్‌ను మోసం చేసి మద్యం మత్తులో వివాహానికి ఒప్పించారు. ఎరికాకు ఉన్న నేర చరిత్రను దాచిపెట్టారు. ఎరికాకు మరోకరితో అక్రమ సంబంధం ఉంది అని నికోలాస్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అందుకు తగిన సాక్ష్యాలను సమర్పించడంతో నికోలాస్ ఆరోపణలకు బలం చేకూరింది.

నికోలాస్ కేజ్ చురుకుగా స్పందించి

నికోలాస్ కేజ్ చురుకుగా స్పందించి

కానీ కేజ్ వివాహ రద్దుపై త్వరగా స్పందించారు. తనను ఎలా మోసం చేశారనే విషయాన్ని రుజువు చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే ఎరికాకు జీవనభృతి చెల్లించాలని కోర్టు ఆదేశించిందా అనే విషయంపై క్లారిటీ లేదు. కోర్టు ఆదేశాలు ఇంకా మీడియాకు అందాల్సి ఉంది. తమ విడాకులపై అటు నికోలాస్ కానీ, ఎరికా గానీ స్పందించకపోవడం గమనార్హం.

నాలుగో పెళ్లి కూడా పెటాకులే

నాలుగో పెళ్లి కూడా పెటాకులే

హాలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరు ఉన్న నికోలాస్ కేజ్‌కు గతంలో మూడు పెళ్లిళ్లు జరిగాయి. అలైస్ కిమ్, లిసా మారి పెర్ల్సీ, పాట్రిసియా అర్‌క్వెట్టే‌ను వివాహం చేసుకొన్నాడు. తాజాగా మేకప్ ఆర్టిస్టు ఎరికా కోయికాతో 2018 ఏప్రిల్ నుంచి డేటింగ్ చేస్తూ 2019 మార్చి 23న వివాహం చేసుకొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X