భార్యను హింసించి జైలు పాలైన స్టార్ హీరో కుమారుడు
నికోలస్ కేజ్ హాలీవుడ్‌లో ఒకప్పటి నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్న హీరో. మన తెలుగు ప్రేక్షులకు కూడా బాగా సుపరిచితం. ఆయన హీరోగా చేసినటువంటి గోస్ట్ రైడర్, ద రాక్, నేషనల్ ట్రెజర్ లాంటి సినిమాలు తెలుగుకి డబ్ చేసినా మంచి వసూళ్శుని వసూలు చేశాయి. లీవింగ్ లాస్ వేగాస్ అనే సినిమాకు గాను నికోలస్ కేజ్ అతి పిన్న వయసులోనే బెస్ట్ యాక్టర్ అకాడమీ అవార్డుని తీసుకున్న వ్యక్తులలో ఐదవ వాడు. అలా హాలీవుడ్‌లో ఎంతో ఎత్తుకి ఎదిగిన నికోలస్ కేజ్ పేరుని తన కొడుకు ఒక్క రోజులో చెడగొట్టాడు.
నికోలస్ కేజ్ కుమారుని పేరు వెస్టన్ కేజ్. వెస్టన్ కేజ్ తను ప్రేమించిన అమ్మాయి నిక్కి విలియమ్స్ తోనే పెళ్శి చేశాడు నికోలస్ కేజ్. ఇద్దరూ కలసి లాస్ ఏంజిల్స్ అపార్ట్‌మెంట్స్ లో సహాజీవనం సాగిస్తున్నారు. ఐతే ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు ఎక్కువ అయి అరెస్టుకి దారితీసింది. ఆదివారం రాత్రి వెస్టన్ కేజ్ తన భార్యను హింసించగా ఆమె బాటిల్‌తో వెస్టన్ కేజ్ చేతిని గాయపరచి బాల్కనీ నుండి దూకి పారిపోయింది. దీంతో పోలీసుల దగ్గరకు వెళ్శి తన భాదను వినిపించగా వెస్టన్ కేజ్ ని గృహ హింస చట్టం క్రింద అరెస్టు చేయడం జరిగింది. దాంతో వెస్టన్ కేజ్ కూడా తన భార్య పై కేసు పెట్టగా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
ఇటీవలే కేజ్, విలియమ్స్ ఇద్దరూ డ్రగ్ రిహాబలేషన్ ప్రోగ్రామ్స్‌ని పూర్తి చేయడం జరిగింది. కేజ్ మాత్రం $50,000 బాండ్ పూచీ కత్తు మీద జైలు నుండి విడుదల అవ్వగా, విలియమ్స్‌ని మాత్రం తన భర్తను గాయపరచినందుకు సోమవారం వరకు కస్టడీలో ఉంచి సోమవారం మద్యాన్నం విడుదల చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











