అతనితో పెళ్లా..అమ్మో వద్దు అన్నారు..!!
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, నటి నికోల్ కిద్మన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హాలీవుడ్ సూపర్ హీరో, టర్మినేటర్ హీరో 'టామ్ క్రూజ్' ను 23 ఏళ్లలోనే వివాహం చేసుకొని 10 సంవత్సరాల పాటు కలసివున్నాకా విడాకులు తీసుకొన్న ఈమె ఆ తర్వాత ఆస్కార్ అవార్డు సొంతం చేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇటీవల ఆమె టామ్ తో వివాహం జరిగిన రోజుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, టామ్ ను పెళ్లి చెసుకోవద్దని తనని అందరూ బెదిరంచారని చెప్పుకొచ్చింది. అతనితో పెళ్లి ఆమె కెరీర్ కు నష్టం కలిగిస్తుందని ఆమె శ్రేయోభిలాషులు హెచ్చరించారట. కానీ అతనంటే వున్న పిచ్చి ప్రేమ వల్ల తను ఎవరి మాట వినలేదని చెప్పింది.
కానీ అందరూ భయపడినట్టు తన కెరీర్ నాశనం కాలేదని, అతనితో వివాహానంతరం తనకు ఎంతో ప్రాచుర్యం లభించిందని దీని వల్ల తన కెరీర్ పుంజుకొందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కెయిత్ అర్బన్ ను వివాహం చేసుకొంది, టామ్ ప్రస్తుతం క్యాటీ హాల్మస్ ను వివాహం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











