ఎంగేజ్ మెంట్ యేకదా అయింది పిల్లలు గురించి ఏమి ఆలోచించలేదు
జెస్సికా సిమ్ సన్ కిమరియు యన్ యఫ్ యల్ ప్లేయర్ ఎరిక్ జాన్సన్ ఇటీవలే ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. ఐతే జనరల్ గాఅందరూ పెళ్శి ముందే తమకు పుట్టబోయే తమ పిల్లల గురించి ముందుగానే ఆలోచిస్తూ ఉంటారు. కాని వీరిద్దరి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఎంగేజ్ మెంట్ అయింది కాబట్టి పెళ్శి గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా పిల్లలు గురించి కూడా అప్పుడే సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు.
అంతేకాకుండా దీనిపై ఎరిక్ జాన్సన్ మాట్లాడుతూ ప్రస్తుతానికి పిల్లలు వద్దని అనుకుంటున్నామని, కాని రాబోయే కాలంలో మాత్రం తప్పని సరిగా తనతో కలసి నాఫ్యామిలీ వృధ్ది చేసుకుంటానని తెలిపారు. ఇదే సమయంలో పెళ్శి డేట్ గురించి అడడగా ఎరిక్ జాన్సన్ మాట్లాడుతూ ఆవిషయం మీరు జెస్సికా సిమ్ సన్ అడగాల్సిందే. దానికి కారణం తను మాత్రం పెళ్శి డేట్ విషయం లోచాలా నిదానంగా ఉన్నారు. అంతేకాకుండా పెళ్శి డేట్ గురించి నేను ఎక్కువగా మట్లాడకూడదు అంటూ తనదైన శైలిలో పక్కకు తప్పుకున్నారు.
ఇకపోతే జెస్సికా సిమ్ సన్ విషయానికి వస్తే గతంలో నికి లాచీని పెళ్శి చేసుకోవడం జరిగింది. తన మొదటి భర్తనుండి విడాకులు తీసుకున్న తర్వాత మే నెలలో ఎరిక్ జాన్సన్ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. జెస్సికా సిమ్ సన్ మాట్లాడుతూ నాపాత జ్ఞాపకాలు మరచిపోవడానికి నేను ఎరిక్ జాన్సన్ తోడేటింగ్ చేయడం మొదలుపెట్టాను అలా మాఇద్దరి మద్య మొదలైనటువంటి ప్రేమ కాస్త పెళ్శికి దారితీసిందని అన్నారు. నాజీవితాన్ని ఎరిక్ జాన్సన్ లేకుండా ఊహించుకోలేకపోతున్నానంటే అంతలా పెనవేసుకుపోయింది మాబంధం.


Click it and Unblock the Notifications











