ఆ హీరో బస చేసిన హోటల్ రూమ్ లోఎటువంటి డ్రగ్స్ దోరకలేదు..!
చార్లి షీన్ హాలీవుడ్ లోతనకంటూ ఓప్రత్యేకమైన స్దానం సంపాదించుకున్నారు. మేజర్ లీగ్ మరియు హాట్ షాట్స్ సినిమాల ద్వారా తనలోని కామెడీని బయటకు తీశారు. ఈ45సంవత్సరాల హీరో కోన్నికారణాల వల్ల హాస్పిటల్ లోజాయిన్ అవ్వడం జరగింది. ఇతనికి కోన్ని పరీక్షలు నిర్వహించి జబ్బు పూర్తిగా తగ్గన తర్వాత అతనిని ఇంటికి పంపించడం జరగిందంట.
ఇలా అతను హాస్పిటల్ కిరావడానికి వేరే కారణాలు ఉన్నాయి అనుకుంటున్నారు. చార్లి షీన్ బాగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతని తన శరీరం మీద పట్టుని కోల్పోయాడంటూ వార్తలు రావడం, అంతేకాకుండా ఇలా డ్రగ్స్ తీసుకోవడం వల్లనే తనని హాస్పిటల్ కుతీసుకోనిరావడం జరగిందని తన సన్నిహితులు చెప్తున్నారు. ఈ వార్త తెలిసినటువంటి న్యూయార్క్ సిటి పోలీసులు చార్లి షీన్ హాస్పిటల్ లోచేరక ముందు బస చేసినటువంటి హోటల్ పైన అర్దరాత్రి రెండు గంటలు సమయంలో అతని రూమ్ పైరైడ్ చేయడం జరగిందని సమాచారం.
కాని పోలీసులుకు ఎటువంటి ఆధారాలు దోరకకపోవడంతో వెనుతిరిగి వెళ్శడం జరిగింది. దీనిపై స్పందించిన చార్లి షీన్ ఎవరో తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని అసలు నాకు డ్రగ్స్ అలవాటు లేదని వెల్లడించారు. ఇదంతా నాకోక కలలా ఉందని అన్నారు. నాకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల హాస్పిటల్ కువెళ్శాను అంతేకాని డ్రగ్స్ తీసుకోని మాత్రం కాదని అన్నారు. ఐతే ఇదంతా తెలిసినటువంటి తన మాజి భార్య డెనిస్ రిచర్డ్స్ ని ఈవిషయం పైవివరణ అడడగా ఆమె మాట్లాడడానికి నిరాకరించారు.


Click it and Unblock the Notifications











