అతనితో పెళ్లోద్దు కానీ పిల్లలను మాత్రం కనాలనుంది..
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ డైఅనే క్రుగేర్ తన లాంగ్ టర్మ్ బాయ్ ప్రెండ్ జూషువా జాక్సన్‌తో పెళ్లికి మాత్రం ఒప్పుకొకుండా తన ద్వారా పిల్లలను మాత్రం కనడానికి సిద్దమైందని సమాచారం. గతంలో డైఅనే క్రుగేర్ ప్రెంచ్ సూపర్ హీరో కానెట్‌ని వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే వీరిద్దరు కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. తన భర్త నుండి విడిపోయినప్పటి నుండి కూడా డైఅనే క్రుగేర్ బాయ్ ప్రెండ్ జూషువా జాక్సన్‌తో కలసి సహాజీవనం సాగిస్తుంది. ఈ సందర్బంలో మీ ఇద్దరూ ఎప్పటి నుండో కలసి సహా జీవనం సాగిస్తున్నారు కదా భవిష్యత్తులో మీ ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించగా..
ఈ ప్రశ్నకు సమాధానంగా డైఅనే మాట్లాడుతూ నా జీవితంలో ఒకసారి పెళ్లి అనే అంకం జరిగిపోయింది. ఇక రెండవ పెళ్లి గురించి నేను ఆలోచించడం లేదు. కానీ నాకు పిల్లలను కనాలని మాత్రం ఉందని 35 సంవత్సరాల వయసు కలిగిన డైఅనే క్రూగేర్ అన్నారు. నాకు దేవుడు ప్రసాదించిన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నాకు పిల్లలతో ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ వారిని చాలా చక్కగా చూసుకొవాలని ఆరాట పడుతున్నానని అన్నారు.
దేవుడిచ్చిన ఈ ముగ్గురు కూతుళ్లులలో ఒక అమ్మాయి మాత్రం లండన్‌లో ఉంది. నేను ఎప్పుడైనా సెలవులకు లండన్ వెళితే తనని పార్క్‌లకు, 'జూ' లకు తీసుకొని వెళడం జరుగుతుందని ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో క్రుగేర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











