ఇక నగ్నంగా అందాలను ప్రదర్శించను: గాసిప్ గర్ల్
లాస్ ఏంజిల్స్: రాబోయే కాలంలో నేను నటించనున్న సినిమాల్లో నగ్నత్వానికి తావు లేకుండా నటిస్తానని ఫేమస్ గాసిప్ గర్ల్ హీరోయిన్ బ్లేక్ లివ్‌లీ తెలిపింది. 24 సంవత్సరాల వయసు కలిగిన బ్లేక్ లివ్‌లీ తనని అందరూ సెక్స్ బాంబ్‌గా చూడడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.
నేను సినిమాలలో నగ్నత్వం చూసినప్పుడు, ఎంతో వ్యాకులత చెందాను. కానీ నేను ఏమీ చేయలేకపోయాను. ఇలా చేయడం కరెక్టు కాదని అనుకుంటున్నానని స్టైల్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది.
ఇక బ్లేక్ లివ్‌లీ ఫిగర్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఉంటుంది. తన అందాలతో యావత్ హాలీవుడ్‌నే ఒక ఊపు ఊపింది. తను ఇంత ఫిట్‌గా ఉండేందుకు గాను ఎలాంటి వ్యాయామాలు చేయనని తేల్చి చెప్పింది. నేను దారుణంగా ఉంటాను. నేను ప్రతీది ఎంతో కష్టంగా నేర్చుకుంటాను. నేను ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతానని చెప్పింది.
బ్లేక్ లివ్‌లీ 'సావేజస్' అనే సినిమా షూటింగ్‌లో లాస్ ఏంజిల్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బ్లేక్ లివ్‌లీ నటించిన రొమాన్స్ సీన్లు హాలీవుడ్‌లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ని విడుదల చేశారు.
సావేజస్ సినిమాలో బ్లేక్ లైవిలీ మాన్ హాట్టన్ సిటీలో నివసించే హై సోసైటీ గర్ల్ పాత్రలో ఒదిగిపోయిందని సినిమా విశ్లేషకులు తెలిపారు. హిప్పీ గర్ల్ గా బ్లేక్ లివ్‌లీ చేసిన నటన అమోఘం. సినిమా ట్రైలర్‌లో బ్లేక్ లివ్‌లీ ఇద్దరు డ్రగ్ డీలర్స్‌తో డేటింగ్ చేసే సన్నివేశాలు బాగా వచ్చాయని దర్శకుడు తెలిపారు. డ్రగ్ డీలర్స్ పాత్రలలో ఆరోన్ జాన్సన్, టేలర్ నటించారు. దీనితో పాటు సెక్స్ అండ్ ది సిటి 2 టివి షోలో తన అందాలతో బ్లేక్ లివ్‌లీ అలరించనుంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











