కాల్ గర్ల్ పాత్రలో నగ్నంగా నటించడం లేదు..!
అమెరికన్ హీరోయిన్, నిర్మాత, టెలివిజన్ డైరెక్టర్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న జెన్నిఫర్ హెవిట్ చిన్న తనంలోనే డిస్నీ ఛానెల్ సిరిస్ 'కిడ్స్ ఇన్ కార్పోరేటెడ్' ద్వారా హాలీవుడ్‌కి పరిచయమైంది. సిబిఎస్ టెలివిజన్ ప్రోగ్రామ్ 'గోస్ట్ విస్పర్' అనే కార్యక్రమంలో మిలిందా గోర్డాన్ పాత్రకు గాను 2007, 2008 సంవత్సరానికి 'సాటర్న్ అవార్డు'ని సొంతం చేసుకుంది. ది క్లయింట్ లిస్ట్ అనే టెలివిజన్ సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి నామినేట్ అయింది.
1999లో విడుదలైన 'హావ్ ఐ డీల్' అనే జెన్నిఫర్ హెవిట్ మ్యూజిక్ ఆల్బమ్ 'బిల్‌బోర్డ్ హాట్ 100'లో స్దానం దక్కించుకుంది. త్వరలో తాను నటిస్తున్న 'ది క్లయింట్ లిస్ట్' టెలివిజన్ సిరిస్‌లో జెన్నిఫర్ హెవిట్ కాల్ గర్ల్ పాత్రని పోషిస్తుంది. ఈ సందర్బంలో జెన్నిఫర్ హెవిట్ మాట్లాడుతూ నాకు తెలిసి నేను నటించనున్న ఈ కాల్ గర్ల్ పాత్ర కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నానని అన్నారు.
ఎందుకంటే 'ది క్లయింట్ లిస్ట్' నేను పోషిస్తున్న పాత్ర కాల్ గర్ల్ అయినప్పటికీ ఈ షో మాత్రం నగ్నంగా మనుషులను చూపించే షో కాదని అన్నారు. ఐతే ఇందులో ఊహాలోకంలో విహారించే సన్నివేశాలు వచ్చినప్పుడే కాస్త జాగ్రత్త పడాలన్నారు. చివరగా మీరు ఎవరితో మీ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తున్నారు అని ప్రశ్నించగా.. దీనికి సమాధానంగా జెన్నిఫర్ హెవిట్ ప్రస్తుతం ఈ షో క్రూ మెంబర్స్‌తో మాత్రమే సంబంధాలను కొనసాగిస్తునన్నారు. దీంతో నన్ను ప్రేమించే మగ కుక్కలన్నీ అసూయ పడుతున్నాయని అన్నారు.


Click it and Unblock the Notifications











