twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేమ్స్‌ బాండ్ సినిమాపై కరోనా ఎఫెక్ట్.. అఫీషియల్‌ స్టేట్‌మెంట్

    |

    సాధారణంగా జేమ్స్‌ బాండ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. వరల్డ్ వైడ్ ఆడియన్స్ జేమ్స్‌ బాండ్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి జేమ్స్‌ బాండ్ చిత్రాన్ని కూడా వదలలేదు కరోనా భూతం.

    ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ బాగా విస్తరించి ఇప్పటికే వేలాది మంది మరణించారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ దాదాపు క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తూ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు.

    No Time to Die: CoronaVirus effect on James Bond movie

    దీంతో ఈ పరిస్థితుల్లో తమ సినిమాను విడుదల చేయకూడదని డిసైడ్ అవుతున్నారు ఇంటర్నేషనల్ సినీ నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే జేమ్స్‌ బాండ్ తాజా సినిమా 'నో టైమ్ టు డై' సినిమా విడుదలను వాయిదా వేశారు. చిత్ర విడుదలను ఏప్రిల్ 8వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అంటే దాదాపు 7 నెలలపాటు వాయిదా వేశారన్నమాట.

    జేమ్స్‌ బాండ్ చిత్రాలకు వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంటుంది. సో.. ఏప్రిల్ 8న జేమ్స్‌ బాండ్ 'నో టైమ్ టు డై' విడుదల చేయాలనుకున్న చిత్రయూనిట్ ఈ మేరకు ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. కానీ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సినిమాను నవంబర్ నెలకి వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు ఆ చిత్ర నిర్మాతలు.

    English summary
    The coronavirus outbreak emerged in China and has spread globally. In all, more than 94,000 people have contracted the virus worldwide. With this reason James bond No Time to Die movie postponed for seven months.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X