Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నేను యాక్షన్ సినిమాలకు పనికిరాను: రాబర్ట్ ప్యాటిన్సన్
లండన్, జూన్ 4: హాలీవుడ్ అందగాడు రాబర్ట్ ప్యాటిన్సన్ మాట్లాడుతూ తాను యాక్షన్ హీరో అయ్యే అవకాశాలు చాలా తక్కువని భావిస్తున్నాడు. ఎందుకంటే యాక్షన్ హీరో కావాలంటే శరీర నిర్మాణం ధృడంగా ఉండాలని, తన శరీరం ధృడంగా ఉండదు కాబట్టి తనకు తగ్గట్లుగానే పాత్రలను ఎంచుకుంటానని అన్నాడు.
26 సంవత్సరాలు వయసు కలిగిన రాబర్ట్ ప్యాటిన్సన్ చిన్న, ఆసక్తికరమైన సినిమాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నానని, అదే మార్గంలోనే ప్రస్తుతం పయనిస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతానికి రోబోట్ సినిమాలలో నటించడానికి చాలినంత సత్తా తనకు లేదని అన్నాడు. అంతేకాకుండా రాబర్ట్ ప్యాటిన్సన్ తన సామర్ధ్యంపై విశ్వాసం లేదని వెల్లడించాడు.
కాన్సిడెన్స్ నాకు పెద్ద ప్రాబ్లమ్. ప్రస్తుతం హాలీవుడ్లో ఇప్పుడిప్పుడే తప్పడటుగులు వేస్తున్నాను.. త్వరలోనే అభిమానులు అదారాభిమానులను సొంతం చేసుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. పంచంలో అత్యంత దుర్మార్గుడిగా పేరొందిన ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ జీవితం ఆధారంగా హాలీవుడ్లో ఓ సినిమాని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా పేరు 'మిషన్: బ్లాక్ లిస్ట్'. ఈ సినిమాలో హీరోగా ప్రపంచంలో సెక్సీయస్ట్ మ్యాన్ స్దానాన్ని కైవసం చేసుకున్న ట్విలైట్ స్టార్ 'రాబర్ట్ ప్యాటిన్సన్' నటించనున్నాడు.
వాస్తవిక జీవితంలో మిలిటరీ ఇంటరాగేటర్గా పని చేసిన ఎరిక్ మేడాక్స్ రచించిన నవల ఆధారంగా తీయనున్నారు. ఇంతకీ ఎవరీ ఎరిక్ మైడాక్స్ అని అనుకుంటున్నారా.. సద్దాం హుస్సేన్ కోసం అన్వేషణలో సహాయపడింది ఇతనే. ఈ చిత్రంలో 'రాబర్ట్ ప్యాటిన్సన్' ఈ ఎరిక్ మేడాక్స్ పాత్రను పోషించనున్నారు.
సద్దాం హుస్సేన్ని 2003లో బంధించి 2006లో ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలను జీన్-స్టిఫానే సావైర్ వహిస్తున్నాడు.