twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గర్బవతిని అయ్యేందుకు సిద్దంగా లేను: కైరా నైట్లీ

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరోయిన్ కైరా నైట్లీ గర్భవతి అంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఆమె స్పందించారు. కైరా నైట్లీ మాట్లాడుతూ నాకూ పిల్లలంటే చాలా ఇష్టమే, ఐతే పిల్లలు కనేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న కైరా నైట్లీ, జేమ్స్ రింగ్టన్ జంటకు ఇటీవలే ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ జంట ఇటీవల పబ్లిక్‌లో ఎక్కడ కనిపించినా పిల్లలు ఎప్పుడు అన్న ప్రశ్నకు పై విధంగా స్పందించారు.

    ప్రజలు అందరూ నన్ను ప్రగ్నెంట్ ఎప్పుడవుతావని అడుగుతున్నారు. ఐతే ఇప్పుడు నేను అందుకు సిద్దంగా లేను. పిల్లలను కనేందుకు ఎప్పుడో ఒకప్పుడు సిద్దమే.. ఎందుకంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ప్రస్తుతం బిజీ బిజీగా షూటింగ్స్‌లలో ఉండడం వల్ల నా సినీ కెరిర్‌కే ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు ప్రస్తుతం నా శరీరం కూడా అందుకు సిద్దంగా లేదని తేల్చి చెప్పింది.

    ఇప్పటి వరకు నన్ను నాలుగు, ఐదు సార్లు మీరు ప్రగ్నెంటా అని అడిగారు. దీంతో నా మదిలో ఆలోచన మొదలైంది. నేను చూసేందుకు ప్రగ్నెంట్ స్త్రీ లాగా కనిపిస్తున్నానా.. ఎంత మాత్రం ఎంగేజ్‌మెంట్ ఐతే అందరూ ఈ విధంగా ప్రశ్నిస్తున్నారా అంటూ కస్సుబుస్సుమంది.

    27 సంవత్సరాల వయసు కలిగిన కైరా నైట్లీకి మరియు జేమ్స్ రింగ్టన్‌ ఇద్దరికి మే నెలలో ఎంగేజ్‌మెంట్ అయింది. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం 'సీకింగ్ ఎ ప్రెండ్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' అనే సినిమాలో నటిస్తున్నారు. నాకు కాబోయే పాట్నర్ జేమ్స్ రింగ్టన్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో ఎన్నడూ నేను జేమ్స్‌తో కలిసి పని చేయలేదు. కానీ మా ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఒకే చిత్రంలో ఇద్దరం కలిసి పని చేయడం చాలా నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పింది.

    అంతక ముందు గతంలో కైరా నైట్లీ తన కోస్టార్ రూపర్ట్ ప్రెండ్‌తో డేటింగ్ చేశారు. కొన్ని మనస్పర్దల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actress Keira Knightley is amused at rumours that she is pregnant. She says although she would love to have children, it was not yet time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X