కూతురి జుట్టు కత్తిరించినందుకు ఆమె భర్త పై మండిపడిపోతోంది..!!
ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ ఈ మధ్యన తన భర్త పీటర్ ఆండ్రీ పై తెగమండిపడిపోతోంది. తన కూతురి ముఖం చూసినప్పుడల్లా తెగ బాధపడిపోతోందట, దీనికి కారణం అయిన అతని మీద విరుచుకుపడుతోందట. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా...?? ఇటీవల క్రిస్ట్ మస్ పండుగని పురస్కరించుకొని ఆమె మాజీ భర్త పీటర్ వారిద్దరి పిల్లలనీ తన ఇంటికి తీసుకుపోవడానికి కోర్టు ద్వారా అనుమతి పొంది తీసుకుపోవడానికి వచ్చాడట. అతనితో పంపడానికి ఇష్టం లేకపోయినా గతి లేక అతనితో తన పిల్లలను పంపింది క్యాటీ.
ఆ తర్వాత తిరగొచ్చిన తన కూతురిని చూసిన ఆమెకు నోటమాట రాలేదు. కానీ తన భర్త మీద మాత్రం బూతులవర్షం కురిపించిందట. తన ఇంటికి తీసుకుపోయిన పీటర్ చక్కా వారితో వుండక తన కూతురి హెయిర్ స్టయిల్ నచ్చక ఆమె జుట్టును తనకు నచ్చినట్టు కత్తింరించాడట. దీంతో ఆమె పొట్టి జుట్టుతో ఇంటికి వెళ్లిందట. ఇది చూసిన క్యాటీ మాత్రం తన కూతురిని అలా చూడలేక అతన్ని వీలున్న ప్రతిసారీ తిట్టుపోస్తోందట. అంతే మరి పడనప్పుడు రామా అన్నా బూతులాగే వినిపిస్తుంది...!! ఏమంటారు..??


Click it and Unblock the Notifications











