అక్టోబర్ లో స్టైక్స్, ఇప్పుడేమో మంచు మా షోకి పెద్ద తలనోప్పిగా మారాయి..
పాప్ ఐకాన్ లేడిగాగా యూరప్ లోతల పెట్టినటువంటి ప్రదర్శన మరలా వాయిదా పడింది. దీనికి కారణం యూరప్ లోకురుస్తున్నటువంటి మంచు వర్షాలు. ఈప్రదర్శన గత అక్టోబర్ లోనే జరగాల్సి ఉండడంతో అప్పుడు యూరప్ మొత్తం జరుగుతున్నటువంటి సమ్మెలు కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సరే అని ఇప్పుడు డిసెంబర్ లోజరుపుకుందామని అనుకుంటే ఇప్పుడు మంచు కారణంగా యూరప్ దేశాలలోకి పెద్ద వాహానాలకు అనుమతిని నిరాకరిస్తున్నారు.
వాతవరణానికి సంబందించినటువంటి అధికారులు పారిస్ నగరంలోకి పెద్ద పెద్ద ట్రక్సు రానివ్వడంలేదని సమాచారం. పెద్ద ట్రక్కులను రానివ్వడం వల్ల ట్రాఫిక్ కుబాగా అంతరాయం కలుగుతుందని ఈనిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇక లేడీగాగా ప్రదర్శన బెర్సీ స్టేడియంలో జరుగుతుండగా అక్కడకు లేడీగాగాకు సంబంధించినటువంటి పెద్ద ట్రక్కులకు అనుమతి నిరాకరించడంతో ఆలోచనలో పడ్డామని నిర్వాకులు తెలిపారు.
దీనిపై స్పందించినటువంటి లేడీగాగా తన ట్విట్టర్ లోకోంచెం బాధపడుతూ నాకు సంబంధించినటువంటి 28 ట్రక్కులను నిలిపివేయడం జరిగిందని, కనుక షోని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుందని ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన ట్రక్కులు ఉంటేనే తనకు కావాల్సినటువంటి సెట్స్ వేయడం జరుగుతుందని, పవర్ ఎక్విప్ మెంట్ కూడా నిలిపివేయడం, అంతేకాకుండా లేడీగాగా పారిస్ లోతనకు సంబంధించినటువంటి ఇద్దరూ ఉద్యోగులను కూడా అరెస్టు చేయడం జరిగిందని కనుక షోచేయడం కష్టంగా ఉంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications











