twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హాలీవుడ్ క్రేజీ జంట నగ్న విగ్రహం ఆ ఇంటికే హైలెట్ అట...!!

    By Kuladeep
    |

    హాలీవుడ్ నటీమణులు నగ్నంగా నటించడం కొత్తేమీ కాదు. అయితే ఆ నటీమణుల తాలూకు నగ్న విగ్రహాలను ప్రతిష్టించడం మాత్రం కొత్త ప్రక్రియే. ఇంతకు ముందు అమెరికాలోని ఓక్లహోమా సిటీలో ఏంజిలీనా జోలీ నిలువెత్తు నగ్న విగ్రహం దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుటి నగ్న విగ్రహంలో కూడా ఈ సెక్సీ భామ ఏంజలీనా జోలీ పాలు పంచుకోవడం విశేషం. కానీ ఈ సారి ఆమె తన ప్రియుడు బ్రాడ్ పిట్ తో కలసి వున్న నగ్న విగ్రహాన్ని రూపొందించారు.

    ప్రముఖ సెలబ్రిటీల విగ్రహాలను రూపొందించే డ్యానియల్ ఎడ్వర్డ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. హాలీవుడ్ క్రేజీ జంట జోలీ, బ్రాడ్ లు నగ్నంగా వుండి తన్మయత్నం లో వున్నట్టు రూపొందించిన ఈ విగ్రహాన్ని $500,000 వ్యయంతో రూపొందించిన బంగాళాలోని బెడ్ రూమ్ లో వుంచనున్నరట. ఇంత వ్యయం తో రూపొందించిన ఈ బంగళా మొత్తానికీ ఈ విగ్రహమే హైలట్ అట.

    ఈ విగ్రహం లోని మరో విశేషం ఏమిటంటే, దీన్ని ఏంజలీనా, బ్రాడ్ లు కలసి ఒక సంవత్సరం అయిన సందర్భంగా జరిగిన వేడుకలో వారు వైన్ సేవించిన గ్రాసుల గాజు ముక్కలతో దీన్ని తయారు చేయండం. ఏదైతేనేం సెలబ్రిటీలకు సంబంధించినంత వరకూ వారు ఏం చేసినా ఓ వింతే మరి. కాగా డ్యానియల్ ఎడ్వర్డ్ ఇంతకు ముందు పాప్ తార బ్రిట్నీ స్పియర్స్, ప్రస్తుత అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ నగ్నంగా వున్న విగ్రహం, ఏంజీలీనా శువుకు పాలిస్తున్నట్లుగా వున్న నగ్న విగ్రహాలను రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X