పాత్ర డిమాండ్ చేసింది సినిమాలో నగ్నంగా నటించాను
హాలీవుడ్ సెక్సీ స్టార్ ఓలివియా విల్డీ తాను కొత్తగా నటిస్తున్న చిత్రం 'కౌబాయ్స్ అండ్ అలైన్స్'. ఈ చిత్రంలో ఓలివియా విల్డీ తాను నగ్నంగా నటిస్తున్నానని హాలీవుడ్ యాక్సెస్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది. హాలీవుడ్ యాక్సెస్ వెబ్‌సైట్‌కి వచ్చినప్పుడు మారియా మెనానిస్ ఇంటర్యూలో ఓ ప్రశ్నగా మీరు ప్రస్తుతం నటిస్తున్న 'కౌబాయ్స్ అండ్ అలైన్స్' లో నగ్నంగా నటిస్తున్నారని విన్నాం అది నిజమేనా అని అడడగా..
ఈ ప్రశ్నకు బదులుగా ఓలివియా విల్డీ అవును అని సమాధానం చెప్పి నవ్వారు. దీనిపై వివరణ ఇస్తూ ఆమె నగ్నంగా నటించడానికి గల కారణాలను వెల్లడించారు. 'కౌబాయ్స్ అండ్ అలైన్స్' సినిమాలో కొన్ని సీన్లు నగ్నంగా నటిస్తేనే వాటికి అందం. ఇది మాత్రమే కాకుండా స్టోరీ కూడా కొన్ని పరిస్దితులలో అలా డిమాండ్ చేయడం వల్లనే నేను అలా చేయాల్సి వచ్చిందని అన్నారు. అలా నగ్నంగా చేయడాన్నికూడా ఓలివియా విల్డీ సమర్దించుకున్నారు.
ప్రస్తుతం ఓలివియా విల్డీ రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఒకటి 'కౌబాయ్స్ అండ్ అలైన్స్' కాగా, రెండవది ద చేంజ్ - అప్ అనే సినిమా. 'కౌబాయ్స్ అండ్ అలైన్స్' మాత్రం జులై 29న విడుదల అవుతుంది. 'కౌబాయ్స్ అండ్ అలైన్స్'లో హీరోగా జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ గ్రెగ్ నటించగా, హీరోయిన్‌గా ఓలివియా విల్డీ నటించడం జరిగింది. వీరిద్దరితోపాటు ఓ ముఖ్యపాత్రలో హారిసన్ ఫోర్డ్ కూడా నటిస్తున్నారు.
రెండవ సినిమా ద చేంజ్ - అప్ సినిమా విషయానికి వస్తే ఇది పుల్ కామెడీ సినిమా అని అన్నారు. ఆగస్టు 5న ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోని అమెరికాలో వేయనున్నారు. ఈ సినిమాలో ఓలివియా విల్టీ క్యారెక్టర్ తనకి ఎటువంటి ఐడియా లేకపోయినప్పటికీ తను చూపించే పనులు చాలా ఉన్నతంగా ఉంటాయని తెలియజేసింది. అంతేకాకుండా ద చేంజ్ - అప్ అనే సినిమాలో తాను ఇష్టపడి చేస్తున్న క్యారెక్టర్ అంటూ తెగ పోగిడేస్తుంది.


Click it and Unblock the Notifications











