షాక్: ‘బ్రెస్ట్ మిల్క్’తో ఐస్ బకెట్ చాలెంజ్ (వీడియో)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: ప్రపంచ వ్యాప్తంగా ఎఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్ జోరుగా సాగుతున్నసంగతి తెలిసిందే. హాలీవుడ్ నటుల దగ్గర నుండి టాలీవుడ్ వరకు ఈ ఐస్ బకెట్ చాలెంజ్ విస్తరించింది. అయితే అందరూ ఐస్ ముక్కలను బకెట్లో వేసుకుని మీద పోసుకుంటూ ఉంటుంటే....హాలీవుడ్ బ్యూటీ ఒలివా వైల్డ్ మాత్రం అందరూ షాకయ్యేలా వినూత్నంగా చేసింది. బకెట్ పాలను తన ఒంటిమీద పోసుకుంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/9tqigLPbjDs?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

ఇందుకోసం తాను బ్రెస్ట్ మిల్క్(చనుబాలు) వాడినట్లు చెప్పింది. అయితే తర్వాత అలాంటిదేమీ లేదని....తాను జోక్ చేసానని, అవి మామూలు పాలే అంటూ మాట మార్చింది. పిల్లలకు డబ్బా పాలు పట్టొద్దు..తల్లి పాలే పట్టాలి(బ్రెస్ట్ ఫీడింగ్) అంటూ సాగుతున్న కార్యక్రమానికి ఒలివా వైల్డ్ సపోర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాను ఐస్ బకెట్ చాలెంజ్ కోసం బ్రెస్ట్ మిల్క్ వాడానని ఆమె చెప్పగానే అంతా నిజమే అనుకుని షాక్ అయ్యారు. ఒలివా వైల్డ్ ఇలా చేయడం ద్వారా ఇటు ఐస్ బకెట్ చాలెంజ్ చేయడంతో పాటు, అటు 'బ్రెస్ట్ ఫీడింగ్'కు ప్రచారం కల్పించింది. అమ్మడి ఐడియా అదరింది కదూ..

Olivia Wilde performs 'breast milk' ice bucket challenge

ఐస్ బకెట్ చాలెంజ్ అంటే ఏమిటి?
జాన్ ఫ్రేట్స్ అనే వ్యక్తి ఈ సరికొత్త కాన్సెప్టుకు తెరతీశాడు.. ఆయన 29 ఏళ్ల కుమారుడు పీటర్ కు అమీయో ట్రాఫిక్ లాటరల్ సెరోసిస్ ఏ ఎల్ ఎస్ అనే అరుదైన వ్యాధి సోకింది. దీని గురించి ప్రచారం, కాన్సర్ సంస్థకు విరాళం దృష్టిలో పెట్టుకుని జూన్ నెలలో ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్టు చేశాడు...అక్కడ నుండి మొదలయిన ఐస్ బకెట్ చాలెంజ్ అంతటా విస్తరించింది. ఈ ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించిన ఒక్కొక్కరు మరో ముగ్గురిని సవాల్ చేస్తుండటంతో వేగంగా విస్తరించింది. సోషల్ మీడియా ద్వారా ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. విరాళాలు కూడా బాగా వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X