కరోనా దెబ్బకు మరోసారి వాయిదా పడిన ఆస్కార్ అవార్డ్స్.. కొత్త డేట్ ఫిక్స్!
ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఈ సారి మరో అద్భుతమైన ఈవెంట్ ని ఆడియెన్స్ మిస్ కాబోతున్నారు. ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆస్కార్ అవార్డ్స్ పై ప్రతి ఏడాది ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే 2021లో జరగాల్సిన 93వ అకాడమీ అవార్డుల వేడుక మరికొన్ని నెలలు ఆలస్యం కానుంది.
హాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఏడాది వరకు రిలీజ్ చేయకుండా రిలీజ్ తేదీలను వాయిదా వేసుకున్నాయి. దీంతో అవార్డుల వేడుకలను నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చాలా రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా మరొక డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆస్కార్ అవార్డ్స్ సెలబ్రేషన్స్ 2021 ఫిబ్రవరిలో గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. ఇంతలో కరోనా భూగోళాన్ని కుదిపేయడం సినిమా పరిశ్రమలను గట్టి దెబ్బ కొట్టింది. ఇక 2021 లోనే రెండు నెలల గ్యాప్ అనంతరం ఏప్రిల్ 25న వేడుకను నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వివిధ కారణాల వల్ల నాలుగు సార్లు అకాడమీ అవార్డ్స్ వేడుకను వాయిదా వేసి ఆలస్యంగా నిర్వహించారు.


Click it and Unblock the Notifications











