Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చెన్నై ప్రజల నీటి కష్టాలు చూసిన చలించిపోయిన హాలీవుడ్ హీరో
తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కొంటున్న చెన్నై నగరం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. నగర ప్రజలకు ఇతర ప్రాంతాల నుంచి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా చెన్నైలో వర్షాలు లేక పోవడంతో తాగునీటి వనరులు ఎండిపోయాయి. నగరం చుట్టు పక్కల చాలా చోట్ల చెరువులు, కుంటలను పూడ్చి భవనాలు నిర్మించడం కూడా ఇలాంటి పరిస్థితి కారణం.
చెన్నై నగర వాసుల కష్టాలపై హాలీవుడ్ నటుడు, టైటానిక్ మూవీ స్టార్ లియోనార్డో డికాప్రియో స్పందించారు. ఎండిపోయిన భావి నుంచి నీటిని తోడుకుంటున్న ఫోటో తన ఇన్‌స్టా గ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసిన ఆయన... ఈ పరిస్థితి నుంచి చెన్నై నగరం బయటపడాలంటే వర్షాలు పడటం ఒక్కటే మార్గమని తెలిపారు.

సౌతిండియాలోని చెన్నై నగరం నీరు లేక అల్లాడుతోంది. ఈ బావి పూర్తిగా ఖాళీ అయింది. నగరానికి తాగునీరు అందించే నాలుగు ప్రధాన వనరులు పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని పట్టుకోవడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. నీరు లేక పోవడంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. నీటిని అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వర్షం పడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చెన్నై ప్రజలు వర్షం కోసం ప్రార్థనలు చేయాలి అంటూ లియోనార్డో డికాప్రియో వ్యాఖ్యానించారు.
అంతే కాదు భారత్‌లో రోజు రోజుకు పెరిగిపోతున్న చెత్త సమస్యపై కూడా ఇటీవల లియోనార్డో డికాప్రియో స్పందించారు. ఇండియాలో ఓ డంపింగ్ యార్డ్‌లో 65 మీటర్ల ఎత్తులో చెత్త పేరుకుపోయిందని, ప్రతి సంవత్సరం ఇది 10 మీటర్ల ఎత్తు పెరుగుతోందని, త్వరలోనే తాజ్ మహల్ ఎత్తును కూడా ఇది అధిగమిస్తుందని తెలిపారు.