twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెన్నై ప్రజల నీటి కష్టాలు చూసిన చలించిపోయిన హాలీవుడ్ హీరో

    |

    తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కొంటున్న చెన్నై నగరం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. నగర ప్రజలకు ఇతర ప్రాంతాల నుంచి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా చెన్నైలో వర్షాలు లేక పోవడంతో తాగునీటి వనరులు ఎండిపోయాయి. నగరం చుట్టు పక్కల చాలా చోట్ల చెరువులు, కుంటలను పూడ్చి భవనాలు నిర్మించడం కూడా ఇలాంటి పరిస్థితి కారణం.

    చెన్నై నగర వాసుల కష్టాలపై హాలీవుడ్ నటుడు, టైటానిక్ మూవీ స్టార్ లియోనార్డో డికాప్రియో స్పందించారు. ఎండిపోయిన భావి నుంచి నీటిని తోడుకుంటున్న ఫోటో తన ఇన్‌స్టా గ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసిన ఆయన... ఈ పరిస్థితి నుంచి చెన్నై నగరం బయటపడాలంటే వర్షాలు పడటం ఒక్కటే మార్గమని తెలిపారు.

    Only rain can save Chennai from this situation: Leonardo dicaprio

    సౌతిండియాలోని చెన్నై నగరం నీరు లేక అల్లాడుతోంది. ఈ బావి పూర్తిగా ఖాళీ అయింది. నగరానికి తాగునీరు అందించే నాలుగు ప్రధాన వనరులు పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని పట్టుకోవడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. నీరు లేక పోవడంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. నీటిని అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వర్షం పడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చెన్నై ప్రజలు వర్షం కోసం ప్రార్థనలు చేయాలి అంటూ లియోనార్డో డికాప్రియో వ్యాఖ్యానించారు.

    అంతే కాదు భారత్‌లో రోజు రోజుకు పెరిగిపోతున్న చెత్త సమస్యపై కూడా ఇటీవల లియోనార్డో డికాప్రియో స్పందించారు. ఇండియాలో ఓ డంపింగ్ యార్డ్‌లో 65 మీటర్ల ఎత్తులో చెత్త పేరుకుపోయిందని, ప్రతి సంవత్సరం ఇది 10 మీటర్ల ఎత్తు పెరుగుతోందని, త్వరలోనే తాజ్ మహల్ ఎత్తును కూడా ఇది అధిగమిస్తుందని తెలిపారు.

    English summary
    "Only rain can save Chennai from this situation." A well completely empty, and a city without water. The southern Indian city of Chennai is in crisis, after the four main water reservoirs ran completely dry. The acute water shortage has forced the city to scramble for urgent solutions and residents have to stand in line for hours to get water from government tanks." Leonardo dicaprio said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X