ఫొటోగ్రాఫర్లే మమ్మల్ని లైంగికంగా వేదిస్తున్నారు: మోడల్ సంచలన ప్రకటన
హాలివుడ్ లో జరుగుతున్నట్లుగా తమ మోడలింగ్ ప్రపంచంలోనూ ఫోటోగ్రాఫర్లు పలువురు మోడళ్లను లైంగికంగా వేధించారని క్యాథరిన్ ఆరోపించటంతో మరికొంతమంది మోడల్స్ కూడా ముందుకు వస్తున్నారట .
అనేక మంది తారలను అగ్ర నిర్మాతల్లో ఒకరైన హార్వీ విన్‌స్టీన్ లైంగిక వేధింపులకూ, అత్యాచారాలకూ గురిచేశాడనే ఆరోపణలు హాలీవుడ్‌ను కదిపి, కుదిపేస్తున్నాయి. ఆఖరుకి ఐశ్వర్యారాయ్‌నీ పొందాలని ఆయన ప్రయత్నించాడనే వాస్తవం ఇండియన్ నటీనటులకూ, ప్రేక్షకులకూ ఆశ్చర్యాన్ని కలిగించింది.

మీ టూ హాష్ ట్యాగ్
ఇక ఆ తర్వాత విన్‌స్టీన్ తో మొదలైన మీ టూ హాష్‌ట్యాగ్ మొత్తం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి. లైంగిక వేదింపులకూ, ఇబ్బందులకూ గురైన వాళ్ళంతా బయటికి చెప్పటం మొదలు పెట్టారు.. ఈ నేపథ్యం లో మోడళ్ళు కూడా తమ వృత్తిలో ఎదురవుతున్న వేదింపులను చెప్పటం మొదలు పెట్టారు.

కేవలం సెక్స్ కోసమే
ఒంటోరియో ప్రముఖ మోడల్, అందాల సుందరి డ్రూ క్యాథరిన్ సంచలన ప్రకటన చేసింది. తాను మోడలింగ్ చేసే సమయంలో సాక్షాత్తూ ఫోటోగ్రాఫర్లే తనను లైంగికంగా వేధించారని డ్రూ క్యాథరిన్ ఆరోపించింది. మోడలింగ్ లో వృత్తిపరమైన చనువుని ఫొటోగ్రాఫర్లు కేవలం సెక్స్ కోసమే వాడుకోవాలని చూస్తుంటారంటూ చిన్న సైజు దుమారానికి తెర లేపింది.

లైంగిక వేధింపులపై పెదవి విప్పారు
ఇటీవల హాలీవుడ్ తారలు లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా ప్రకటనలు చేసిన నేపథ్యంలో ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన మోడళ్లు కూడా లైంగిక వేధింపులపై పెదవి విప్పారు. ఫోటో షూట్ ల కోసం తాము వెళ్లినపుడు ఫోటోగ్రాఫర్ల నుంచి లైంగిక వేధింపులు తమకు తప్పడం లేదని క్యాథరిన్ వాపోయింది.

మోడలింగ్ ప్రపంచంలోనూ
హాలివుడ్ లో జరుగుతున్నట్లుగా తమ మోడలింగ్ ప్రపంచంలోనూ ఫోటోగ్రాఫర్లు పలువురు మోడళ్లను లైంగికంగా వేధించారని క్యాథరిన్ ఆరోపించటంతో మరికొంతమంది మోడల్స్ కూడా ముందుకు వస్తున్నారట . క్యాథరిన్ ఈ విషయం పై ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది. మరోవైపు క్యాథరిన్ తన తాజా ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.


Click it and Unblock the Notifications











