twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డాక్యుమెంటరీ షూటింగ్ కోసం ముంబైకి రానున్న ఓప్రా

    By Nageswara Rao
    |

    అమెరికన్ టీవీ మొఘల్ ఓప్రా విన్‌ఫ్రే త్వరలో మనదేశంలో పర్యటించనున్నారు. మొదటిసారిగా ఇక్కడికి వస్తున్న ఆమె బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లను కలవాలని భావిస్తున్నారు. తన కొత్త షో 'నెక్ట్స్ చాప్టర్' షూటింగ్ కోసం ఆమె ఇక్కడికి వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, వార్తల్లోని వ్యక్తులు, ఇతరుల ఇంటర్వ్యూలను ఇందులో ప్రసారం చేయనున్నారు.

    డాక్యుమెంటరీ షూటింగ్ కోసం ఓప్రా విన్‌ఫ్రే ఇక్కడికి వస్తున్నారు. మమల్ని కలిసేందుకు ఆమె ఆసక్తి చూపించారు. ఆమెను కలవడం నిజంగా గొప్పవిషయం. విన్‌ఫ్రే అంటే నాకు, ఐష్‌కు చాలా ఇష్టం, గౌరవం అని అభిషేక్ బచ్చన్ విలేకరులతో చెప్పారు. 2005లో ఐశ్వర్యరాయ్ తొలిసారిగా విన్‌ఫ్రే టాక్‌షోలో పాల్గొన్నారు. 2009లో తన భర్త అభిషేక్‌తో కలిసి టాక్‌షోకు వెళ్లిన విషయం అందరికి తెలిసిందే.

    ఇటీవలే ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవలే ప్రపంచలో ఎక్కవ డబ్బు సంపాదించే మహిళ లిస్ట్‌ని విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో మొట్టమొదటి స్దానాన్ని టాక్ షో రాణి ఓప్రా విన్ఫ్రే కైవసం చేసుకున్నారు. ఓప్రా విన్ఫ్రే సంపాదించేటటువంటి ఆదాయం మొత్తం $290 మిలియన్లుగా ఫోర్బ్స్ మ్యాగజైన్ తెలిపింది. ఓప్రా విన్ఫ్రే తర్వాత రెండవ స్దానంలో హాలీవుడ్ చెత్తగా సింగర్‌గా పేరు తెచ్చుకున్న లేడీగాగా నిలిచారు. లేడీగాగా సంపాదన $90 మిలియన్లుగా తెలిపింది.

    ఇక వన్ ఇండియా పాఠకులకు ఓప్రా విన్ ఫ్రే షో గురించి కొంత సమాచారం క్లుప్తంగా.. అందిస్తున్నాం. ఈ టాక్‌షో పాతికేళ్ల క్రితం ఆరంభమై ఇప్పటికీ ప్రభంజనంలా కొనసాగుతూనే ఉంది. కాకపోతే 2011 సెప్టెంబర్‌లో ఈ టాక్‌షోకి చివరి భాగాన్ని పూర్తి చేశారు. మొదట్లో ఈ షోకి ఆదరణ అంతంత మాత్రమే అయినప్పటికీ, 1983లో 'ఓప్రా విన్‌ఫ్రే షో' (ఎ.ఎం.షికాగో షో)కి ఓప్రా వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలోనే టిఆర్‌పి రేటింగ్‌లు ఒక్కసారిగా పెరిగాయి. ఈ షోకి సంబంధించిన కొన్ని ప్రత్యేకతల్ని పాఠకులతో పంచుకోవాలి. 1986లో 'ఎ.ఎం.షికాగో షో' పేరు ఓప్రా విన్‌ఫ్రే షోగా మార్పు చెందినది.

    ఈ పాతికేళ్లలో 5000కు పైగా ఎపిసోడ్స్ ప్రసారమై, అమెరికన్ టెలివిజన్ చరిత్రని తిరగరాసి, 19 సంవత్సరాలపాటు అగ్రస్థానంలో నిలిచిన టాక్‌షో ఇదేనంటే అతిశయోక్తి కాదు. మీడియా అంటే అస్సలు గిట్టని మైకేల్ జాక్సన్ ఓప్రా విన్‌ఫ్రే షోకి హాజరవటమే కాదు.. అతను విటిలిగో అనే వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రపంచానికి తెలిసింది కూడా ఓప్రా ఇంటర్వ్యూతోనే. ఇక ఈ షోని వారానికి దాదాపు ఐదు కోట్ల మంది తిలకిస్తారని అంచనా. స్టూడియోలో మూడొందల మంది వీక్షకులు పాల్గొంటారు.

    ఈ పాతికేళ్లలో ఈ షోని ప్రత్యక్షంగా చూసిన వీక్షకుల సంఖ్య పదకొండు లక్షల పైమాటే. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో ఓప్రా విన్‌ఫ్రే షో ప్రసారమవుతుంది. ఇందులో పాల్గోన్న ప్రముఖుల సంఖ్య 900పైనే. ఈ షోలో అత్యధికంగా పాల్గొన్న నటి జూలియా రాబర్ట్స్. దాదాపు పదిసార్లు ఈ షోలో పాల్గొని తన అనుభవాల్ని పంచుకున్నారు. బిల్ క్లింటన్, జార్జిబుష్, ఒబామా, జోర్డాన్ రాణి రానియాలే లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ షోలో పాల్గోన్నారు.

    English summary
    International talk show queen Oprah Winfrey has reportedly landed in Mumbai and will meet a variety of well-known figures and celebrities Monday at a dinner hosted by socialite Parmeshwar Godrej.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X